బోర్డర్‌లో చైనా బలగాలు తగ్గాయ్‌.. భారత కీలక వ్యూహం ఫలించిందా?

బోర్డర్‌లో చైనా బలగాలు తగ్గాయ్‌.. భారత కీలక వ్యూహం ఫలించిందా?

Chinese troops decreased at border did India strategy work
  • ఉత్తర సరిహద్దుల్లో తగ్గిన చైనా బలగాలు
  • భారత్‌ 10 బ్రిగేడ్‌ స్థాయి బలగాల తరలింపు
  • ఎల్‌ఏసీ వెంట భారత సైన్యం అప్రమత్తం
  • భారత్‌-చైనా మధ్య కొనసాగుతున్న చర్చలు కొనసాగుతున్నాయి
  • రక్షణ శాఖ వార్షిక నివేదికలో కీలక విషయాలు
భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయా? అంటే రక్షణ వర్గాల నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. బోర్డర్ లో ఇటీవల చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) బలగాల మోహరింపు గణనీయంగా తగ్గినట్లు రక్షణ శాఖ తాజా వార్షిక నివేదిక వెల్లడించింది. సరిహద్దుల్లో భారత్‌ తన సైనిక బలాన్ని మరింత పటిష్ఠం చేయడంతో ఈ మార్పు కనిపించినట్లు పేర్కొంది.

2025లో ఉత్తర సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట, అలాగే చైనా సంప్రదాయంగా శిక్షణ నిర్వహించే ప్రాంతాలకు భారత్‌ 10 బ్రిగేడ్‌ స్థాయి బలగాలను తరలించింది. ఒక్కో బ్రిగేడ్‌లో సుమారు 3,000 మంది సైనికులు ఉంటారు. ఈ బలగాల్లో పదాతిదళం, ఆర్మర్‌, ఆర్టిలరీ, వైమానిక రక్షణ విభాగాలు ఉంటాయి. అవసరమైనప్పుడు స్వతంత్రంగా ఆపరేషన్లు చేపట్టే సామర్థ్యం వీటికి ఉంటుంది.

ఎల్‌ఏసీ వెంట అన్ని ప్రాంతాల్లో భారత సైన్యం అప్రమత్తంగా, పూర్తి సన్నద్ధతతో ఉందని రక్షణ శాఖ తెలిపింది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్థంగా స్పందించేందుకు సైన్యం సిద్ధంగా ఉందని పేర్కొంది.

అదే సమయంలో భారత్‌-చైనా మధ్య రాజకీయ, దౌత్య, సైనిక స్థాయుల్లో చర్చలు కొనసాగడం కూడా సరిహద్దుల్లో స్థిరత్వానికి దోహదపడిందని నివేదిక తెలిపింది. 2025లో మార్చి, జులైలో 33వ, 34వ డబ్ల్యూఎంసీసీ సమావేశాలు జరిగాయి. భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి.

2025 ఆగస్టులో ‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్‌సీఓ) సదస్సు కోసం చైనాలో ప్రధాని మోదీ పర్యటించడం ద్వైపాక్షిక సంబంధాల్లో సానుకూల పరిణామాలకు మరింత ఊతమిచ్చిందని రక్షణ శాఖ పేర్కొంది. తూర్పు లఢఖ్‌లో అక్టోబర్‌ 25, 26 తేదీల్లో జరిగిన 23వ కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి సమావేశం కూడా నిర్మాణాత్మకంగా సాగిందని తెలిపింది.

మరోవైపు జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని రక్షణ శాఖ తెలిపింది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ డీజీఎంఓల మధ్య మే 10, 12 తేదీల్లో జరిగిన చర్చలతో పరిస్థితి చాలావరకు స్థిరపడిందని పేర్కొంది. అయితే నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట పరిస్థితులు ఇంకా అనూహ్యంగానే ఉన్నాయని.. నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది.
Advertisement
China
India-China border
PLA troops
LAC tension
Narendra Modi
Indian Army

More Telugu News