కాంగ్రెస్‌కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చే యోచనలో డీఎంకే? ప్రాంతీయ పార్టీలతో వరుస భేటీల వెనక వ్యూహం అదేనా?
- ప్రాంతీయ పార్టీల నేతలతో కనిమొళి వరుస భేటీలు
- ఉద్ధవ్ ఠాక్రేతో కీలక చర్చలు
- శరద్ పవార్, సుప్రియా సూలేతో సమావేశం
- పునర్విభజన ప్రభావంపై ప్రాంతీయ పార్టీల దృష్టి
- మాన్, అఖిలేశ్‌తోనూ భేటీలకు సిద్ధం
- మూడో రాజకీయ వేదికపై ఊహాగానాలు
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపుపై రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్‌లో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో డీఎంకే కీలక రాజకీయ కసరత్తుకు తెరతీసింది. డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి.. విపక్ష కూటమిలోని ప్రాంతీయ పార్టీల నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌తో విభేదాలు ఉన్న పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే అవకాశాలపై ఆమె చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ముంబైలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కనిమొళి సమావేశమయ్యారు. బాంద్రాలోని మాతోశ్రీ నివాసంలో జరిగిన ఈ భేటీ దాదాపు గంటపాటు సాగింది. ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా ఆమెకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. శివసేన (యూబీటీ) ఎంపీలు అనిల్ దేశాయ్, మిలింద్ నార్వేకర్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.
పునర్విభజన బిల్లు, బీజేపీపై కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి, ఇండియా కూటమి భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై నియోజకవర్గాల పునర్విభజన ప్రభావం ఎలా ఉండొచ్చు? దీనిపై ప్రాంతీయ పార్టీలు ఎలా కలిసి పనిచేయాలి? అనే అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఉద్ధవ్‌తో భేటీ తర్వాత కనిమొళి ఢిల్లీ వెళ్లి ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలేతో వేర్వేరుగా సమావేశమయ్యారు. త్వరలో పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్ మాన్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తోనూ ఆమె భేటీ కానున్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌కు భిన్నంగా ఆలోచిస్తున్న ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేసే అవకాశాలను డీఎంకే పరిశీలిస్తోందన్న ఊహాగానాలకు ఈ వరుస భేటీలు బలం చేకూరుస్తున్నాయి. ఇదే ప్రయత్నం ముందుకు వెళ్తే బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ స్వతంత్రంగా మరో జాతీయ రాజకీయ వేదికకు మార్గం సుగమం కావచ్చన్న చర్చ కూడా మొదలైంది.