జయ బచ్చన్ టైమ్‌కు రెడీ అయ్యేలా అమితాబ్ ఫన్నీ ట్రిక్.. బిగ్‌బీ ఏం చేస్తారంటే?
- జయ కోసం అమితాబ్ ఫన్నీ ట్రిక్
- గంట ముందుగానే సమయం చెబుతారట
- దాంతో జయ ముందే రెడీ అవుతారట
- కేబీసీలో ఈ విషయాన్ని వెల్లడించిన బిగ్‌బీ
- బిగ్‌బీ కామెంట్స్ నెట్టింట వైరల్
అమితాబ్ బచ్చన్.. అభిమానులతో తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో ఓ కంటెస్టెంట్ అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం నెట్టింట వైరల్‌గా మారింది. భార్య జయా బచ్చన్ సమయానికి రెడీ అయ్యేలా చేసేందుకు తాను చేసే పాటించే ఓ టిప్ గురించి బిగ్‌బీ సరదాగా వెల్లడించాడు.
ఈవెంట్‌లు, ఫంక్షన్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముందుగా బయలుదేరే సమయాన్ని నిర్ణయించుకుంటామని అమితాబ్ చెప్పాడు. అయితే జయకు మాత్రం అసలు సమయం కంటే గంట ముందుగానే చెబుతాడట. ఉదాహరణకు సాయంత్రం 6 గంటలకు ఫంక్షన్‌కు వెళ్లాల్సి ఉంటే.. జయకు 5 గంటలకే బయలుదేరాలని చెబుతాడట. దీంతో ఆమె 4 గంటల నుంచే సిద్ధమవడం మొదలుపెడతారని, చివరకు అనుకున్న సమయానికి ఇద్దరూ ఫంక్షన్‌కు చేరుకుంటారని తెలిపాడు.
ఇదే షోలో గతంలోనూ జయ గురించి అమితాబ్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. షూటింగ్ కారణంగా ఇంటికి ఆలస్యంగా వెళ్లాల్సి వస్తే.. ఉదయాన్నే ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో చేతులు జోడించిన ఎమోజీతో ‘నమస్కారం’ అంటూ మెసేజ్ పెడతాడట. తనకు షూటింగ్ ఉందని, ఇంటికి ఆలస్యంగా వస్తానని ముందే చెప్పేస్తాడట. అలాగే తన కోసం డిన్నర్‌కు వేచి ఉండొద్దని కూడా చెబుతాడట.
అలా ముందుగానే సమాచారం ఇచ్చేస్తే జయతో చివాట్లు తప్పుతాయని అమితాబ్ నవ్వుతూ చెప్పాడు. అయితే చెప్పడం మరిచిపోతే మాత్రం ఆమె కచ్చితంగా కోప్పడుతుందని సరదాగా వెల్లడించాడు. బిగ్‌బీ చెప్పిన ఈ భార్యాభర్తల సరదా సంగతులు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.