భారత్‌లో జాబ్ ఇంటర్వ్యూలు మరీ టఫ్.. అమెరికాలో మాత్రం అలా కాదట!
- భారత్‌లో సీనియర్ టెక్ ఇంటర్వ్యూలు కఠినంగా ఉంటున్నాయని రెడిట్ పోస్ట్
- భారత్‌లో 45 నిమిషాల్లో రెండు హార్డ్ ప్రశ్నలు అడుగుతున్నారని వ్యాఖ్య
- అమెరికాలో అనుభవం, సిస్టమ్ డిజైన్‌కు ప్రాధాన్యం ఉంటుందని వెల్లడి
- అమెరికాలో ప్రాక్టికల్ కోడింగ్ వైపు ఇంటర్వ్యూలు మారుతున్నాయని వెల్లడి
- అమెరికాలో కొన్ని ఉద్యోగాలకు 4 లక్షల డాలర్ల వరకు జీతం ఉంటుందని ప్రస్తావన
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళుతున్నారా? అయితే భారత్‌లో మీకు ఎదురయ్యే ప్రశ్నలు అమెరికాలో అడిగే ప్రశ్నల కంటే కఠినంగా ఉండొచ్చట. ముఖ్యంగా సీనియర్ టెక్ ఉద్యోగాల విషయంలో ఈ తేడా ఎక్కువగా కనిపిస్తోందని ఓ రెడిట్ యూజర్ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చకు దారితీసింది.
‘ఎగ్జిస్టింగ్ఎఫెక్టివ్639’ అనే రెడిట్ యూజర్ భారత్, అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల ఇంటర్వ్యూ విధానాలను పోలుస్తూ ఈ పోస్ట్ చేశారు. దీనికి 1,000కి పైగా అప్‌వోట్లు వచ్చాయి. రెండు దేశాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే విధానంలో చాలా తేడా ఉందని ఆయన పేర్కొన్నారు.
అమెరికాలో సీనియర్ ఉద్యోగాలకు అభ్యర్థి గత అనుభవానికి ఎక్కువ విలువ ఇస్తారని ఆ యూజర్ చెప్పారు. సిస్టమ్ డిజైన్‌పై అవగాహన, సమస్యను పరిష్కరించే తీరు, బిహేవియరల్ స్కిల్స్‌ను కూడా పరిశీలిస్తారని తెలిపారు. లీట్‌కోడ్ తరహా ప్రశ్నలు అడిగినా ఈజీ నుంచి మీడియం స్థాయిలోనే ఉంటాయని పేర్కొన్నారు.
భారత్‌లో మాత్రం పరిస్థితి మరోలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్టాఫ్ స్థాయి ఉద్యోగానికి కూడా కఠినమైన కోడింగ్ ప్రశ్నలు ఎదురవుతున్నాయని చెప్పారు. 45 నిమిషాల్లో రెండు హార్డ్ లెవల్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయని వివరించారు.
కొన్ని భారతీయ కంపెనీల్లో వరుసగా పలు కోడింగ్ రౌండ్లు ఉంటాయని ఆ యూజర్ తెలిపారు. వాటిలో లీట్‌కోడ్ కఠినమైన ప్రశ్నలు కూడా వస్తాయని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో సిస్టమ్ డిజైన్‌కు మాత్రం ఒకే రౌండ్ ఉండొచ్చని పేర్కొన్నారు.
అమెరికాలో మాత్రం ఉద్యోగార్థి నిజ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ఎలా పరిష్కరిస్తాడనే దానిపై దృష్టి పెరుగుతోందని చెప్పారు. బలమైన అనుభవం, సిస్టమ్ డిజైన్ నైపుణ్యం ఉంటే కఠినమైన కోడింగ్ ప్రశ్నలు లేకుండానే సీనియర్ ఉద్యోగానికి ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయని అన్నారు.
ఇక జీతాల విషయాన్ని కూడా రెడిట్ యూజర్ ప్రస్తావించారు. అమెరికాలో ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా ఏటా 4 లక్షల డాలర్ల వరకు జీతం వచ్చే ఉద్యోగాలు దక్కుతున్నాయని చెప్పారు. భారత్‌లో మాత్రం అంతకంటే తక్కువ జీతాల కోసం కూడా కఠినమైన టెక్నికల్ రౌండ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు.
సీనియర్ స్థాయి ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు కేవలం కఠినమైన కోడింగ్ ప్రశ్నలపైనే ఆధారపడకుండా.. వారి అనుభవం, సిస్టమ్ డిజైన్ సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ పోస్ట్‌పై రెడిట్‌లో ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.