ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు: హైదరాబాద్‌లో 13 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
- వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- సెప్టెంబర్ 12 నుంచి 24వ తేదీ వరకు ఆంక్షలు అమలు
- ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు మళ్లింపులు
- భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాల ఏర్పాటు
- ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని నగర పోలీసుల సూచన
హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈ నెల 12 నుంచి 24వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. ఈ 13 రోజుల పాటు రోజూ ఉదయం 11 గంటల నుంచి భక్తుల రద్దీని బట్టి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని స్పష్టం చేశారు.
ప్రధాన మళ్లింపులు ఇవే:
పోలీసులు ప్రకటన ప్రకారం, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి బడా గణేష్ వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ మీదుగా మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి ఐమ్యాక్స్ వైపు వెళ్లే వాహనాలు సచివాలయం ఎక్స్ రోడ్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. అదేవిధంగా, నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సచివాలయం జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా అనుమతిస్తారు. నిరంకారి నుంచి ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వచ్చే వాహనాలను పాత సైఫాబాద్ పీఎస్ జంక్షన్ మీదుగా మళ్లిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
భక్తులకు పార్కింగ్ సౌకర్యాలు:
గణపతి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలను కేటాయించారు. రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ పార్కింగ్ స్థలం, ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి వచ్చే భక్తుల కోసం విశ్వేశ్వరయ్య భవన్‌లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. వాహనదారులు రద్దీగా ఉండే మార్గాలకు బదులుగా ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. అత్యవసర సహాయం కోసం 90102 03626 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.