భర్త సినిమా బ్లాక్‌బస్టర్.. థియేటర్లో కన్నీళ్లు పెట్టుకున్న భార్య!
- ‘మండాడి’ సినిమా విజయంపై దర్శకుడి భార్య భావోద్వేగభరిత పోస్ట్
- గతంలో పడిన కష్టాలు గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నానన్న లిరిక్ రైటర్ జయశ్రీ
- సూరి హీరోగా నటించిన ఈ చిత్రంతో తెలుగు నటుడు సుహాస్ తమిళ అరంగేట్రం
- సముద్రంలో డూప్ లేకుండా రిస్క్‌తో కూడిన ఫైట్స్ చేసిన హీరో సూరి
- గురువారం విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచి వైనం
సాధారణంగా ఒక సినిమా విజయం సాధిస్తే చిత్ర బృందం మొత్తం ఆనందంలో మునిగిపోతుంది. కానీ, ఆ విజయం వెనుక ఏళ్ల తరబడి పడిన కష్టం, ఎన్నో నిద్రలేని రాత్రులు, లెక్కలేనన్ని అవమానాలు ఉంటే ఆ ఆనందం భావోద్వేగభరితంగా మారుతుంది. తమిళ దర్శకుడు మతిమారన్ పుగళేంది విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఆయన దర్శకత్వం వహించిన ‘మండాడి’ చిత్రం గురువారం విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని, ఆయన భార్య, ప్రముఖ లిరిక్ రైటర్ జయశ్రీ మతిమారన్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమ కుటుంబ ఫొటోను షేర్ చేస్తూ జయశ్రీ తన ఎక్స్ ఖాతాలో భావోద్వేగభరితమైన నోట్‌ను పంచుకున్నారు. "ఈ రోజు ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇప్పటికీ కదిలిపోతూనే ఉన్నాను. థియేటర్లో ‘మండాడి’ చిత్రానికి మీరు చూపిన ప్రేమ నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రతి క్షణం మేము కలిసి పడిన కష్టాలు, ఒకరికొకరం అండగా నిలబడిన రోజులు, ప్రతి కష్టాన్ని కలిసి ఎదుర్కొన్న క్షణాలు కళ్ల ముందు మెదిలాయి" అని ఆమె రాశారు.
"థియేటర్లో నేను ఏడ్చాను. చప్పట్లు కొట్టాను. గట్టిగా అరిచాను. అతడిని కౌగిలించుకున్నాను. ఈ భావోద్వేగాల మధ్య, నాకు చెప్పలేనంత గర్వంగా అనిపించింది. ఓపిక, పట్టుదల, నమ్మకం ఒక మనిషిని ఎంత బలంగా, ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళతాయో చెప్పడానికి అతనే నిజమైన ఉదాహరణ. లవ్ యూ మతిమారన్. కష్టాల్లోనూ మనం కలిసి జీవించాం.. ఇప్పుడు ఈ విజయాన్ని, ఆనందాన్ని, ప్రతి అందమైన క్షణాన్ని కలిసి ఆస్వాదిద్దాం" అని ఆమె తన భర్తను ఉద్దేశించి రాసుకొచ్చారు. చివరగా, సినిమాలోని ఒక డైలాగ్‌ను ఉటంకిస్తూ, "పోరాటం నుంచి వేడుక వరకు సాగిన ఈ ప్రయాణం నాకు చాలా ప్రత్యేకం" అని ముగించారు.
‘మండాడి’ విషయానికొస్తే, ఇది తమిళనాడు తీరప్రాంత సంస్కృతి స్ఫూర్తితో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. సముద్రంలోని సవాళ్లను ఎదుర్కొనే నాయకత్వ పటిమ ఉన్న వ్యక్తుల కథ ఇది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సూరి, మహిమా నంబియార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో తెలుగు నటుడు సుహాస్ తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆయన ఇందులో ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపించారు. వీరితో పాటు సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్ వంటి ప్రముఖులు నటించారు.
ఈ చిత్రం సూరి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా నిలుస్తుంది. ముఖ్యంగా సముద్రంలో చిత్రీకరించిన హై-రిస్క్ యాక్షన్ సన్నివేశాల్లో సూరి డూప్ లేకుండా నటించడం విశేషం. కొన్ని నెలల పాటు సెయిల్‌బోట్ రేసింగ్‌లో కఠినమైన శిక్షణ తీసుకుని, ఆ సన్నివేశాలకు ప్రాణం పోశారని చిత్ర వర్గాలు తెలిపాయి. రామనాథపురం తీర ప్రాంతంలో చిత్రీకరించిన ఈ చిత్రం, తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.