రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ రియల్టర్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ రియల్టర్ ఆత్మహత్య

Prominent realtor commits suicide in Rangareddy district
  • రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ రియల్టర్ ఆత్మహత్య
  • హోమ్ ల్యాండ్ అధిపతి రామ్ రెడ్డిగా గుర్తింపు
  • నెదునూరులోని ఫామ్‌హౌస్‌లో బలవన్మరణం
  • ప్రాజెక్టు విషయంలో రాజకీయ ఒత్తిళ్లే కారణమని ప్రాథమిక సమాచారం
హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, హోమ్ ల్యాండ్ సంస్థ అధినేత రామ్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కందుకూరు మండలం నెదునూరు గ్రామంలోని తన ఫామ్‌హౌస్‌లో ఆయన బలవన్మరణం చెందారు.

రామ్ రెడ్డి పటాన్‌చెరు ప్రాంతంలో సుమారు 280 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొందరు రాజకీయ నాయకుల నుంచి ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆ ఒత్తిళ్లను తట్టుకోలేకే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Ram Reddy
Home Land Real Estate
Rangareddy realtor suicide
Patancheru venture
Nedunuru farmhouse

More Telugu News