తెలంగాణలో 'ఎస్ఐఆర్' గడువు మరోసారి పొడిగింపు

తెలంగాణలో 'ఎస్ఐఆర్' గడువు మరోసారి పొడిగింపు

Election Commission of India extends Telangana SSR deadline once again
  • అక్టోబర్ 7 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్స్ స్వీకరణ
  • సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని అంగీకరించిన ఎన్నికల సంఘం
  • నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా విడుదల
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు దాఖలు చేసేందుకు అక్టోబర్ 7వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది.

గతంలో పొడిగించిన షెడ్యూల్ ప్రకారం ఈ గడువు సెప్టెంబర్ 16తో ముగియాల్సి ఉంది. అయితే, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు మరింత సమయం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి వేర్వేరుగా లేఖలు రాశారు. వారి విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం, గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 7 వరకు అభ్యంతరాలను స్వీకరించి, వాటిని పరిష్కరించిన అనంతరం నవంబర్ 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఈసీ నిర్ణయంతో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే వారికి, అలాగే జాబితాలో తప్పులను సరిదిద్దుకోవాలనుకునే వారికి అదనపు సమయం లభించినట్లయింది.
Advertisement
Election Commission of India
Telangana Voter List
Revanth Reddy
Special Summary Revision
Voter Registration Telangana

More Telugu News