ఢిల్లీ కూడా టోక్యోలా మారగలదు.. జపాన్‌లోని భారతీయుడి ఆకాంక్ష

ఢిల్లీ కూడా టోక్యోలా మారగలదు.. జపాన్‌లోని భారతీయుడి ఆకాంక్ష

Delhi can also turn into Tokyo aspiration of an Indian in Japan
  • టోక్యో నిర్మలమైన ఆకాశాన్ని చూపిస్తూ ఓ భారతీయుడి వీడియో
  • ఢిల్లీ ఆకాశం అలా ఎందుకు ఉండదని సూటి ప్రశ్న
  • ఢిల్లీ కంటే టోక్యో జనాభా ఎక్కువే అయినా కాలుష్యం తక్కువ
  • ప్రయత్నిస్తే ఢిల్లీని కూడా పరిశుభ్రంగా మార్చవచ్చని ఆశాభావం
జపాన్ రాజధాని టోక్యోలో నివసిస్తున్న ఓమ్ అనే భారతీయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టోక్యోలోని స్వచ్ఛమైన నీలాకాశాన్ని చూపిస్తూ, మన దేశ రాజధాని ఢిల్లీలో ఆకాశం ఎందుకు ఇలా నిర్మలంగా ఉండదని ఆయన ప్రశ్నించారు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటూ, రెండు నగరాల మధ్య నెలకొన్న భిన్నమైన వాతావరణ పరిస్థితులపై చర్చకు దారితీసింది.

భారత్‌లో కాలుష్యానికి అధిక జనాభానే ప్రధాన కారణమని చాలామంది భావిస్తుంటారని, కానీ వాస్తవానికి ఢిల్లీ కంటే టోక్యో జనాభా ఎక్కువేనని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయినప్పటికీ టోక్యోలో గాలి, పరిసరాలు ఎంతో పరిశుభ్రంగా ఉంటాయని తన వీడియోలో వివరించారు. "భారతీయ ఆకాశాలతో ఉన్న సమస్య" అనే క్యాప్షన్‌తో ఆయన ఈ పోస్ట్‌ను పంచుకున్నారు.

తన విదేశీ స్నేహితుల్లో కొందరు భారతదేశం అనగానే జనసమ్మర్దంతో కూడిన, దుమ్ముధూళితో నిండిన ప్రాంతంగా భావిస్తుంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారికి హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఈశాన్య రాష్ట్రాల వంటి అందమైన, అత్యంత పరిశుభ్రమైన ప్రాంతాల గురించి తాను వివరిస్తుంటానని ఆయన పేర్కొన్నారు.

మన దేశ రాజధానిలో కూడా స్వచ్ఛమైన ఆకాశం, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటే పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని ఓమ్ అభిప్రాయపడ్డారు. అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే ఇది కచ్చితంగా సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
Om
Delhi air pollution
Tokyo vs Delhi
Indian in Japan viral video
Environmental awareness
Clean air India

More Telugu News