మరో 3 గంటల్లో ఈదురుగాలులతో వర్షాలు.. ఏపీలోని ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్
- గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్
- గురజాల, మాచర్ల, దర్శి, కందుకూరు, ఒంగోలు ప్రాంతాలకు అలర్ట్
- బాపట్ల, గుంటూరు, పిడుగురాళ్ల, నరసరావుపేట, చిలకలూరిపేటలకు అలర్ట్
- రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం
- గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచన
ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు కీలక జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో వాతావరణం ఒక్కసారిగా మారనుందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేసింది.
వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాలపై ప్రభావం అధికంగా ఉండనుందని విపత్తుల సంస్థ పేర్కొంది. ముఖ్యంగా గురజాల, మాచర్ల, దర్శి, కందుకూరు, ఒంగోలు, బాపట్ల, గుంటూరు, పిడుగురాళ్ల, నరసరావుపేట, చిలకలూరిపేటతో పాటు వాటి పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, రైతులు, వాహనదారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీఎస్డీఎంఏ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, ఇతర తాత్కాలిక షెడ్ల కింద నిలబడటం అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేసింది. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని కోరింది.