గుడ్డు పెంకులు చెత్తలో వేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే అస్సలు పడేయరు!
- గుడ్డు పెంకుల్లో సమృద్ధిగా కాల్షియం
- మొక్కలకు సహజ ఎరువుగా వాడొచ్చు
- నత్తలు, స్లగ్స్‌ను దూరంగా ఉంచొచ్చు
- కంపోస్ట్‌లోనూ పెంకులను కలపొచ్చు
- పాత్రల మురికి తొలగించేందుకూ పనికొస్తాయి
గుడ్డు ఉడికించాక పెంకులను చెత్తబుట్టలో వేయడం చాలామంది చేసే పని. కానీ ఈ పెంకుల్లో మొక్కలకు ఉపయోగపడే కాల్షియం సహా పలు ఖనిజాలు ఉంటాయి. ఇంట్లోనే వీటిని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు.
గుడ్డు పెంకుల్లో ప్రధానంగా కాల్షియం కార్బొనేట్ ఉంటుంది. వీటిని మెత్తగా పొడి చేసి మొక్కల మొదళ్ల దగ్గర వేస్తే నేలకు కాల్షియం అందుతుంది. టమాటా, మిరప వంటి మొక్కల్లో వచ్చే కొన్ని సమస్యలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. నేల సారవంతం అయ్యేందుకు కూడా తోడ్పడుతుంది.
గుడ్డు పెంకులను సహజ ఎరువుగా కూడా వాడొచ్చు. కాల్షియంతో పాటు మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు కూడా వీటిలో ఉంటాయి. పెంకులను బాగా ఎండబెట్టి మెత్తగా పొడి చేసి మట్టిలో కలపాలి. లేదంటే కంపోస్ట్‌లోనూ వేయొచ్చు.
తోటలో కొన్ని పురుగులను దూరంగా ఉంచడానికీ ఇవి ఉపయోగపడతాయి. మెత్తగా కాకుండా కొద్దిగా పదునుగా ఉండే పెంకులు మొక్కల చుట్టూ చల్లితే నత్తలు, స్లగ్స్ వంటి జీవులు మొక్కల దగ్గరకు రావడానికి ఇబ్బంది పడతాయి.
కిచెన్ వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేసేవారికి గుడ్డు పెంకులు మంచి పదార్థం. ఇవి నెమ్మదిగా కుళ్లుతూ కంపోస్ట్‌కు కాల్షియం అందిస్తాయి. చివరకు లభించే కంపోస్ట్ మరింత పోషకాలతో ఉంటుంది.
గుడ్డు పెంకులను శుభ్రంగా కడిగి బాగా ఎండబెట్టి పొడి చేస్తే వంట పాత్రలపై పేరుకున్న మురికిని తొలగించేందుకు కూడా వాడొచ్చు. నీటితో కలిపి పేస్ట్‌లా చేసి రుద్దితే జిడ్డు, మురికి తొలగించవచ్చు.