జర్మనీ అందాలకు ఫిదా అవుతున్న భారతీయులు.. క్యూ కడుతున్న యువత
- జర్మనీ టూరిజానికి కీలకంగా భారత పర్యాటకులు
- సాంస్కృతిక అనుభవాలు అందించే ప్రదేశాలకు ప్రాధాన్యం
- జర్మనీ వెళుతున్నవారిలో అధికంగా 38 ఏళ్లలోపు యువతే
- జర్మనీలోని 10 ప్రధాన నగరాల్లోనే భారతీయుల అధిక బస
భారతీయ పర్యాటకులకు జర్మనీ ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా మారుతోంది. జర్మనీ పర్యాటక రంగంలో భారతీయ సందర్శకుల సంఖ్య స్థిరంగా వృద్ధి చెందుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది భారతీయ పర్యాటకుల ఓవర్‌నైట్ స్టేలు (రాత్రి బసలు) గత ఏడాదితో పోలిస్తే 0.1 శాతం పెరిగాయి. ముఖ్యంగా జర్మనీలోని పది ప్రధాన నగరాల్లోనే భారతీయ పర్యాటకులలో 61 శాతం మంది బస చేస్తుండటం గమనార్హం.
జర్మన్ నేషనల్ టూరిస్ట్ ఆఫీస్ (జీఎన్‌టీఓ) ఇవాళ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 2026 మొదటి అర్ధ భాగంలో జర్మనీ మొత్తం 36.4 మిలియన్ల అంతర్జాతీయ ఓవర్‌నైట్ స్టేలను నమోదు చేసింది. అంతర్జాతీయంగా పర్యాటకుల సంఖ్యలో 0.5 శాతం వృద్ధి కనిపించింది.
ఈ సందర్భంగా జీఎన్‌టీఓ ఇండియా మార్కెటింగ్ & సేల్స్ ఆఫీస్ డైరెక్టర్ రోమిత్ థియోఫిలస్ మాట్లాడుతూ.. "ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక పరిస్థితులలో మార్పులు ఉన్నప్పటికీ, జర్మనీకి భారత పర్యాటకుల డిమాండ్ బలంగా ఉందని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. జర్మనీకి భారత్ ఒక ముఖ్యమైన, ఎంతో ఆశాజనకమైన మార్కెట్‌గా కొనసాగుతోంది" అని తెలిపారు.
భద్రత, మెరుగైన కనెక్టివిటీ, సాంస్కృతిక అనుభవాలు, నాణ్యమైన ఆతిథ్యం, డబ్బుకు తగిన విలువను అందించే ప్రదేశాలను భారత ప్రయాణికులు ఎక్కువగా కోరుకుంటున్నారని ఆయన వివరించారు. జర్మనీలోని వైవిధ్యమైన నగరాలు, చారిత్రక సంపద, ప్రకృతి అందాలు, సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ ఈ అంచనాలను అందుకునేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
జర్మనీకి వచ్చే భారతీయ పర్యాటకులు ఎక్కువగా యువత, కొత్త అనుభవాలను కోరుకునేవారేనని థియోఫిలస్ తెలిపారు. వారి సగటు వయసు 38 సంవత్సరాలుగా ఉండటం విశేషం. జర్మనీ సందర్శించే భారతీయులలో దాదాపు 95 శాతం మంది 55 ఏళ్లలోపు వారేనని, ఇది మార్కెట్ దీర్ఘకాలిక సామర్థ్యాన్ని సూచిస్తోందని ఆయన అన్నారు.
2026 ద్వితీయార్థంలో కూడా భారత్ నుంచి డిమాండ్ ఇలాగే కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జర్మనీలో హోటల్ ఆక్యుపెన్సీ కూడా 1.2 శాతం పెరిగి 65.5 శాతానికి చేరుకుంది.