జియో 10వ వార్షికోత్సవ ఆఫర్.. ఈ ప్లాన్‌పై అదనపు ప్రయోజనాలు
- రూ.3,599 ప్లాన్‌పై 120జీబీ అదనపు 5జీ డేటా
- ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు
- రోజుకు 2.5జీబీ హైస్పీడ్ డేటా
- జియోహాట్‌స్టార్, జియోటీవీ సేవలు ఉచితం
- 18 నెలల గూగుల్ ఏఐ ప్రో ఉచితం
రిలయన్స్ జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రీపెయిడ్ కస్టమర్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. ఏడాది కాలం ఉండే రూ.3,599 రీచార్జ్ ప్లాన్‌పై అదనంగా 120జీబీ 5జీ డేటా అందిస్తోంది. దీంతో పాటు జియోహాట్‌స్టార్, జియోటీవీ, జియోఏఐక్లౌడ్ సేవలు కూడా లభించనున్నాయి.
ఈ వార్షిక ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. రోజుకు 2.5జీబీ హైస్పీడ్ డేటా చొప్పున ఏడాదిలో మొత్తం 912.5జీబీ డేటా లభిస్తుంది. దీనికి అదనంగా నెలకు 10జీబీ చొప్పున 5జీ బూస్టర్ డేటాను ఇస్తోంది. 12 నెలల్లో మొత్తం 120జీబీ అదనపు డేటా పొందొచ్చు.
రోజువారీ 2.5జీబీ డేటా పూర్తయిన తర్వాత 64కేబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా అందుతుంది. దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి. జియోటీవీ, జియోఏఐక్లౌడ్ సేవలను కూడా వినియోగించుకోవచ్చు.
ఈ ఆఫర్‌లో జియోహాట్‌స్టార్ మొబైల్+ హాలీవుడ్ సబ్‌స్క్రిప్షన్, 50జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజీ లభిస్తాయి. అంతేకాదు, 18 నెలల గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. దీని విలువ రూ.35,100గా జియో పేర్కొంది. ఇందులో 5టీబీ క్లౌడ్ స్టోరేజీతో పాటు నానో బనానా వంటి ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
ప్లాన్ గడువు ముగిసిన తర్వాత 48 గంటల్లోపు మళ్లీ రీచార్జ్ చేస్తే ఇదే ప్రయోజనాలను కొనసాగించొచ్చు.
ఇదే సమయంలో జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కూడా సంస్థ తిరిగి తీసుకొచ్చింది. రూ.300 వన్‌టైమ్ చెల్లింపుతో ఏడాది పాటు ప్రస్తుత ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ధరలను లాక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ధర రక్షణ 2027 సెప్టెంబర్ 5 వరకు వర్తిస్తుంది. రూ.300 క్యాష్‌బ్యాక్ వోచర్ కూడా లభిస్తుంది.