ఓవైపు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గా జాబ్.. మరోవైపు గోరింటాకు వేస్తూ లక్షల్లో సంపాదన!

ఓవైపు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గా జాబ్.. మరోవైపు గోరింటాకు వేస్తూ లక్షల్లో సంపాదన!

Priyanka Jain Software engineer earns lakhs as part-time Mehendi artist in USA
  • ప్రియాంక జైన్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌
  • పార్ట్‌టైమ్‌గా మెహందీ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న వైనం
  • గంటకు సుమారు 100 డాలర్లు వసూలు చేస్తున్న ప్రియాంక
  • కస్టమర్లు 20 శాతం వరకు టిప్‌ ఇస్తున్నట్లు వెల్లడి
  • 10 గంటల బుకింగ్‌తో రూ.లక్ష వరకు ఆదాయం
అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ భారతీయ యువతి తన పార్ట్‌టైమ్‌ పనితో భారీగా సంపాదిస్తోంది. ఉద్యోగంతో వచ్చే జీతం నెలవారీ ఖర్చులకు ఉపయోగపడుతుంటే.. మెహందీ కళతో అదనపు ఆదాయం పొందుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రియాంక జైన్‌ అమెరికాలో ఫుల్‌టైమ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఖాళీ సమయంలో ప్రొఫెషనల్‌ మెహందీ ఆర్టిస్ట్‌గా సేవలు అందిస్తోంది. తన మెహందీ పనికి గంటకు సుమారు 100 డాలర్లు (రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు) వసూలు చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది. దీనికి అదనంగా కొందరు కస్టమర్లు 20 శాతం వరకు టిప్‌ కూడా ఇస్తున్నారని తెలిపింది.

పెళ్లి వేడుకల్లో మెహందీ బుకింగ్‌ తీసుకుంటే ఆదాయం మరింత పెరుగుతుందని ప్రియాంక చెప్పింది. దాదాపు 10 గంటల పాటు జరిగే ఓ వెడ్డింగ్‌ అసైన్‌మెంట్‌తో ఒకే రోజులో 1,200 డాలర్లకు పైగా.. అంటే దాదాపు రూ.లక్ష వరకు సంపాదించగలుగుతున్నట్లు వివరించింది.

భారత్‌లో మెహందీ ఆర్టిస్ట్‌గా పనిచేయడాన్ని కొందరు చిన్నచూపు చూస్తారని.. అమెరికాలో మాత్రం కళాకారులకు మంచి గౌరవం లభిస్తుందని ప్రియాంక చెప్పింది. ‘‘ఇక్కడ ఏ పనీ చిన్నది కాదు. పని అంటే పనేగా’’ అని హిందీలో పేర్కొంది.

అయితే అమెరికాలో జీవన వ్యయం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని ఆమె తెలిపింది. ప్రియాంక వీడియోకు దాదాపు కోటి వ్యూస్‌ రావడంతో సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. సంప్రదాయ నైపుణ్యాలకు విదేశాల్లో లభిస్తున్న గౌరవంపై పలువురు స్పందించారు. కొందరు మాత్రం భారత్‌లో కళాకారుల ఆదాయంపై సమాజంలో ఉన్న అభిప్రాయాలను ప్రస్తావించారు.
Advertisement
Priyanka Jain
Mehendi Artist USA
Indian Software Engineer
Part Time Income USA
Henna Artist Earnings
Priyanka Jain Viral Video

More Telugu News