సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన నాగబాబు
- ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎమ్మెల్సీ నాగబాబు భేటీ
- ఏపీ గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
- నాగబాబుకు క్యాబినెట్ హోదా కల్పించిన ప్రభుత్వం
- 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచడమే లక్ష్యం
జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆయన సతీసమేతంగా ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా నాగబాబు దంపతులను సీఎం చంద్రబాబు సత్కరించి, నూతన బాధ్యతలకు గాను శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు, మంగళగిరిలోని అరణ్య భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగబాబు ఏపీ గ్రీన్ సొసైటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన తన అర్ధాంగి పద్మజతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి పదవిని అలంకరించారు. ఈ పదవికి ప్రభుత్వం ఆయనకు క్యాబినెట్ హోదా కల్పించింది.
2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతం అడవులు, చెట్లను పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏపీ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా నాగబాబుకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన నాగబాబుకు పీసీసీఎఫ్ పి.వి. చలపతి రావు, అదనపు పీసీసీఎఫ్ రాహుల్ పాండే సహా పలువురు అటవీ శాఖ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.