కార్పొరేట్ ఉద్యోగం పోయింది.. చివరికి ప్లేట్లు కడిగే పనిలో.. వైరల్‌గా మారిన ఉద్యోగి కథ!
- ఉద్యోగం కోల్పోయి డిష్‌వాషింగ్ పనిలో చేరిన 29 ఏళ్ల వ్యక్తి
- గంటకు 11 డాలర్ల జీతంతో పార్ట్‌టైమ్ పని
- 200కుపైగా దరఖాస్తులు చేసినా దొరకని ఉద్యోగం
- 15కుపైగా ఇంటర్వ్యూలు ఇచ్చినా లేని ఫలితం
- డబ్బు కోసం కాదు.. పనికొస్తాననే భావన కోసమే పని అని వెల్లడి
ఉద్యోగం లేక ఖాళీగా ఉండటం అతడిని తీవ్రంగా వేధించింది. కార్పొరేట్ ఉద్యోగం కోల్పోయిన 29 ఏళ్ల వ్యక్తి చివరకు గంటకు 11 డాలర్లు (సుమారు రూ.1,049) వచ్చే డిష్‌వాషింగ్ పనిలో చేరాలని నిర్ణయించుకున్నాడు. డబ్బు కోసం ఈ పని చేయడం లేదని.. తాను ఉపయోగపడుతున్నాననే భావన కోసమే ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నానని సోషల్ మీడియాలో వెల్లడించాడు.
ఏప్రిల్‌లో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే కంపెనీ నుంచి తొమ్మిది నెలల జీతానికి సమానమైన మంచి సెవరెన్స్ ప్యాకేజీ లభించింది. ఆ తర్వాత కొత్త ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. నాలుగు నెలల్లో 200కుపైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేశాడు. 15కుపైగా ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. అయినా ఒక్క ఉద్యోగం కూడా ఖరారు కాలేదు.
ఉద్యోగం లేకపోవడంతో రోజువారీ జీవితం గందరగోళంగా మారిందని చెప్పాడు. తనకు తాను పనికిరానివాడిననే భావన మొదలైందన్నాడు. కార్పొరేట్ ఉద్యోగం తనకు నచ్చకపోయినా.. ఏదో ఒక ఉద్యోగం చేయాలనే ఆలోచన నుంచి బయటపడలేకపోయానని తెలిపాడు.
అయితే ఆర్థిక ఇబ్బందులు లేవని తెలిపాడు. పొదుపుగా జీవించడం వల్ల ఐదేళ్ల పాటు ఖర్చులు భరించేంత అత్యవసర నిధి తన వద్ద ఉందని వెల్లడించాడు. అయినా ఖాళీగా ఉండటం వల్ల కలిగే ఆందోళనను తట్టుకోలేక డిష్‌వాషింగ్ పని ఎంచుకున్నానని చెప్పాడు.
ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పలువురు అతడికి మద్దతుగా నిలిచారు. ఉద్యోగమే మన గుర్తింపు కాదని కొందరు సూచించారు. పనిని చిన్నదిగా చూడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఇతర చిన్నచిన్న పనులు చేసిన తమ అనుభవాలను కూడా పలువురు పంచుకున్నారు.