హైదరాబాద్‌‌ వాసులకు అలర్ట్: ఆ ప్రాంతాల్లో 24 గంటల పాటు నీటి సరఫరా బంద్

Hyderabad Residents Alert 24 Hour Water Supply Shutdown in These Areas
  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 24 గంటల నీటి సరఫరా బంద్
  • శనివారం ఉదయం 10 నుంచి ఆదివారం ఉదయం 10 వరకు అంతరాయం
  • బండ్లగూడ వద్ద పైప్‌లైన్ జంక్షన్ పనుల కారణంగా నిలిపివేత
  • ప్రభావిత ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని సూచన
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) నగరవాసులకు కీలక ప్రకటన విడుదల చేసింది. పైప్‌లైన్ జంక్షన్ పనుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు మంచినీటి సరఫరా నిలిచిపోనున్నట్లు వెల్లడించింది.

జలమండలి వెల్లడించిన వివరాల ప్రకారం, బండ్లగూడ క్రాస్ రోడ్ వద్ద చేపడుతున్న పైప్‌లైన్ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం (ఆగస్టు 29) ఉదయం 10 గంటల నుంచి ఆదివారం (ఆగస్టు 30) ఉదయం 10 గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల తర్వాత సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలలో శాస్త్రిపురం, బండ్లగూడ, శంషాబాద్, మధుబన్, దుర్గా నగర్, సులేమాన్ నగర్, పీడీపీ, గోల్డెన్ హైట్స్, అత్తాపూర్, కిస్మత్‌పూర్, 9 నంబర్, అల్లాబండ, భోజగుట్ట, గంధంగూడ, ప్రసన్న నగర్, జూబ్లీహిల్స్, తట్టిఖానా, గచ్చిబౌలి, మాదాపూర్ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో, ప్రభావిత ప్రాంతాల ప్రజలు నీటిని ముందుగానే తగినంత నిల్వ చేసుకోవాలని, అంతరాయం సమయంలో పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు.
Advertisement
HMWSSB
Hyderabad Water Supply Shutdown
Hyderabad Water Board Alert
Bandlaguda Pipeline Works

More Telugu News