మద్యంలో పామును ఎందుకు వేస్తారు? ఈ వింత డ్రింక్ వెనుక కథేంటి?
- బాటిల్‌లో పాముతో తయారయ్యేదే స్నేక్ వైన్
- దీనికి రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర
- వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్‌లో ప్రసిద్ధి
- పామును అధిక ఆల్కహాల్‌లో నెలలపాటు ఉంచుతారు
- సంప్రదాయ వైద్యంలో దీనికి ప్రాధాన్యం
బాటిల్ చూస్తే మద్యం అనిపిస్తుంది. కానీ లోపల చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే. ఓ గాజు సీసాలో మొత్తం పాము చుట్టుకుని ఉంటుంది. దానిలోనే మద్యం ఉంటుంది. ఇదే ‘స్నేక్ వైన్’. దక్షిణాసియా దేశాల్లో ప్రసిద్ధి చెందిన ఈ సంప్రదాయ పానీయానికి రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది.
పామును సీసాలోనే ఉంచి..
స్నేక్ వైన్ తయారీలో సాధారణంగా మొత్తం పామును అధిక ఆల్కహాల్ ఉన్న బియ్యం లేదా ఇతర ధాన్యాలతో తయారు చేసిన మద్యంలో ఉంచుతారు. కొన్ని చోట్ల తేళ్లు, జిన్సెంగ్, స్థానిక మూలికలను కూడా కలుపుతారు. ఈ మిశ్రమాన్ని కొన్ని నెలల పాటు అలాగే ఉంచుతారు. మద్యంలో ఉండే ఇథనాల్ పాము విషంలోని ప్రమాదకర ప్రొటీన్లను విచ్ఛిన్నం చేస్తుందని నమ్ముతారు. మరో పద్ధతిలో పామును కోసి దాని రక్తాన్ని నేరుగా మద్యంలో కలిపి తాగుతారు.
చైనా నుంచి మొదలైన సంప్రదాయం
స్నేక్ వైన్ చైనాలోని వెస్ట్రన్ జౌ రాజవంశం కాలం నుంచే ఉన్నట్లు చెబుతారు. రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ పానీయం తొలినాళ్లలో రాజ కుటుంబాల ఆరోగ్య పానీయంగా ఉపయోగించారని సమాచారం. ప్రస్తుతం వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్, దక్షిణ చైనాలో ఇది కనిపిస్తుంది.
ఔషధ పానీయమనే నమ్మకం
సంప్రదాయ చైనీస్ వైద్యంలో పాముకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శరీరంలో వేడి పెంచి, ‘తేమ’ను తొలగిస్తుందని నమ్ముతారు. కీళ్ల బిగుతు, ఆర్థరైటిస్ నొప్పి, రక్త ప్రసరణ, దీర్ఘకాలిక అలసటకు ఇది ఉపయోగపడుతుందని జానపద విశ్వాసాలు ఉన్నాయి. శక్తి, సామర్థ్యానికి పామును ప్రతీకగా భావించడంతో పురుషుల శక్తి పెంచుతుందనే నమ్మకం కూడా ఉంది.
మందు మాత్రమే కాదు..
గ్రామీణ ప్రాంతాల్లో అతిథులకు స్నేక్ వైన్ అందించడం గౌరవ సూచకంగా భావిస్తారు. మరోవైపు రాత్రి మార్కెట్లలో పర్యాటకులను ఆకర్షించే వస్తువుగా చిన్న సీసాల్లో విక్రయిస్తారు. సీసాలో కనిపించే పామే దీనికి ప్రత్యేక ఆకర్షణగా మారింది.