ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడేందుకు అనన్య బంగర్ కు క్లియరెన్స్.. తీవ్రంగా వ్యతిరేకించిన సఫారీ ఆల్‌రౌండర్
- సంజయ్ బంగర్ ట్రాన్స్‌జెండర్ కుమార్తె అనన్యకు క్రికెట్ ఆడేందుకు ఆస్ట్రేలియా అనుమతి
- ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన దక్షిణాఫ్రికా స్టార్ మారిజాన్ కాప్
- ఇది దారుణమని, అనుమతించకూడదని సోషల్ మీడియాలో పోస్ట్
- కమ్యూనిటీ క్రికెట్‌లో ఆడేందుకు అనన్యకు 2027 వరకు అవకాశం
- ఎలైట్ క్రికెట్‌కు టెస్టోస్టెరాన్ స్థాయిలపై నిబంధనలు వర్తిస్తాయని వెల్లడి
మహిళా క్రికెట్‌లో ఓ కొత్త వివాదం రాజుకుంది. భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె, ట్రాన్స్‌జెండర్ అయిన అనన్య బంగర్‌కు క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) అనుమతి ఇవ్వడంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి వాటిని అస్సలు అనుమతించకూడదని ఆమె సోషల్ మీడియాలో ఘాటుగా వ్యాఖ్యానించింది.
సంజయ్ బంగర్ కుమార్తె అనన్య, ఈ ఏడాది థాయ్‌లాండ్‌లో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. అనంతరం క్రికెట్‌లోకి తిరిగి రావాలనే ఆసక్తితో మొదట బీసీసీఐని సంప్రదించగా, అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆమె క్రికెట్ ఆస్ట్రేలియాను ఆశ్రయించింది. ఆమె అభ్యర్థనను పరిశీలించిన సీఏ, ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ క్రికెట్ సర్క్యూట్‌లో ఆడేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో ఆమె భవిష్యత్తులో మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL) వంటి ఎలైట్ టోర్నీలలో ఆడేందుకు కూడా మార్గం సుగమమైంది.
ఈ వార్తకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న మారిజాన్ కాప్.. "ఇది పూర్తిగా అసంబద్ధం. దీనిని అస్సలు అనుమతించకూడదు" అని పేర్కొంటూ డబ్ల్యూబీబీఎల్ అధికారిక ఖాతాను ట్యాగ్ చేసింది. కప్ వ్యాఖ్యలతో ఈ అంశం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయంపై అనన్య బంగర్ హర్షం వ్యక్తం చేసింది. "ఇక నేను క్రికెట్ ఆడలేనేమో అని ఒక దశలో ఆందోళన చెందాను. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా నాకు మరో అవకాశం ఇచ్చింది. ఇది నాకు చాలా సంతోషకరమైన రోజు" అని ఆమె ముంబైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో తెలిపింది.
క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం, అనన్య మార్చి 2027 వరకు ఆస్ట్రేలియాలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రీమియర్ క్రికెట్ (కమ్యూనిటీ క్రికెట్) పోటీలలో పాల్గొనవచ్చు. ఆ తర్వాత ఎలైట్ క్రికెట్‌లో ఆడాలంటే, ఆమె రక్తంలో టెస్టోస్టెరాన్ స్థాయి 10 nmol/L కంటే తక్కువగా ఉందని నిర్ధారించే పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. యుక్తవయస్సు వరకు పురుషుడిగా ఉండి, ఆ తర్వాత లింగమార్పిడి చేసుకున్న ట్రాన్స్‌జెండర్ మహిళలను అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ఆడేందుకు ఐసీసీ అనుమతించడం లేదు. అయితే, దేశవాళీ క్రికెట్‌పై బీసీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక విధానాన్ని రూపొందించలేదు. కాగా, అనన్య గతంలో పురుషుడిగా ఉన్నప్పుడు ముంబై ఏజ్-గ్రూప్ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడడం తెలిసిందే.