వ్యాపారం సక్సెస్‌ కావాలంటే ఇదొక్కటి తప్పక చేయాలి.. జోహో శ్రీధర్‌ వేంబు సింపుల్‌ మంత్రం

Sridhar Vembu simple mantra for business success
  • వ్యాపారం చేయాలనుకునేవారు సేల్స్‌ నేర్చుకోవాలని వేంబు సూచన
  • సేల్స్‌ కాల్స్‌లో తిరస్కరణను ఎదుర్కోవాలని సలహా
  • సేల్స్‌తో కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు మెరుగవుతాయని సూచన
  • సేల్స్‌ టీమ్‌ కష్టాలు అర్థమవుతాయని వెల్లడి
  • అమ్మకాలు లేకుండా వ్యాపారం కొనసాగదని స్పష్టీకరణ
వ్యాపారం చేయాలనుకునే ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, వైద్యులకు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వేంబు ఓ సలహా ఇచ్చారు. “అమ్మడం నేర్చుకోండి” అని సూచించారు. ఉత్పత్తి ఎంత గొప్పగా ఉన్నా.. దాన్ని కస్టమర్లకు నమ్మకంగా వివరించి కొనిపించగలగడం వ్యాపారంలో కీలకమని చెప్పారు.

ఇటీవల ‘ఎక్స్‌’లో చేసిన పోస్టులో వేంబు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. వ్యాపారంలోకి రావాలనుకునే వారు ఎక్కువగా సేల్స్‌ కాల్స్‌లో పాల్గొనాలని సూచించారు. తిరస్కరణ ఎదురైనా వెనక్కి తగ్గకుండా ప్రయత్నించాలని చెప్పారు.

సేల్స్‌ చేసే సమయంలో ఎదురయ్యే అనుభవాలు ఎంతో నేర్పుతాయని వేంబు అన్నారు. తమ ఆలోచన ఎంత మంచిదైనా.. దాన్ని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం అంత సులభం కాదని అప్పుడే తెలుస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు మెరుగవుతాయని చెప్పారు.

సేల్స్‌ అనుభవం ఉన్నప్పుడే ఆ విభాగంలో పనిచేసే వారి కష్టం కూడా అర్థమవుతుందని వేంబు తెలిపారు. వ్యాపారంలో అమ్మకాలు లేకుండా ముందుకు సాగడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆయన సూచనకు పలువురు నెటిజన్లు తమ అనుభవాలను పంచుకున్నారు.

ఇటీవల వ్యాపారాలపై పెరుగుతున్న టెక్నాలజీ ఖర్చులపైనా వేంబు స్పందించారు. ఏఐ కారణంగా మెమరీ ధరలు, ఏఐ టోకెన్‌ ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు. దీంతో సాఫ్ట్‌వేర్‌ రంగం మరింత సమర్థమైన ప్రోగ్రామింగ్‌ విధానాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
Advertisement
Sridhar Vembu
Zoho
Business success tips
Sales skills
Entrepreneurship advice
Startup marketing

More Telugu News