కృతి సనన్ డ్రెస్‌పై దుమారం.. రాఖీ యాడ్ ను వెనక్కి తీసుకున్న జ్యువెల్లరీ బ్రాండ్
- కృతిసనన్ నటించిన రాఖీ యాడ్‌ను ఉపసంహరించుకున్న జీవ
- నటి ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
- మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పిన జ్యువెలరీ సంస్థ
- అన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి యాడ్ ను తొలగించినట్లు ప్రకటన
ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ 'జీవ' తన రక్షాబంధన్ వాణిజ్య ప్రకటనను అన్ని మీడియా వేదికల నుంచి ఉపసంహరించుకుంది. బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఈ యాడ్‌లో ఆమె ధరించిన దుస్తులు, ప్రచార కాన్సెప్ట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై 'జీవ' బుధవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని సంస్థ పేర్కొంది. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవడంతో పాటు, పెంపుడు జంతువులతోనూ ఆ అనుబంధాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారాన్ని రూపొందించినట్లు వివరించింది. అయితే, ఇది అనుకోకుండా కొందరి మనోభావాలను దెబ్బతీసిందని అంగీకరించింది. అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ సదరు ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది.
సుమారు 36 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో కృతి సనన్, బ్రాలెట్ తరహా బ్లౌజ్‌తో కూడిన ఇండో-వెస్ట్రన్ దుస్తుల్లో కనిపించారు. తన సోదరుడికి, ఒక పెంపుడు శునకానికి ఆమె రాఖీ కడుతున్నట్లు అందులో చూపించారు. ఆమె వస్తధారణతో పాటు, రక్షాబంధన్ సంప్రదాయంలో పెంపుడు జంతువును భాగం చేయడంపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ ప్రకటనపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. 'లోదుస్తులు ధరించి సోదరుడికి రాఖీ కడతారా?' అని ప్రశ్నిస్తూ, ఇది ఉద్దేశపూర్వకంగా అసభ్యంగా ఉందని వ్యాఖ్యానించారు. నెటిజన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, సదరు జ్యువెల్లరీ బ్రాండ్ ఈ ప్రకటనను వెనక్కి తీసుకుంది.