వైఎస్ వివేకా భూమి కబ్జా వ్యవహారం.. పులివెందుల సీఐపై బదిలీ వేటు
- వివేకా భూమిని కబ్జా చేసిన ముఠా
- జిల్లా కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేసిన సునీత
- నిందితులను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన అర్బన్ సీఐ శ్రీరామ్
కడప జిల్లా పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను కడప వీఆర్ కు పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన భూమి కబ్జా వ్యవహారంలో నిర్లక్ష్యం వహించినందుకే డీఐజీ కోయ ప్రవీణ్ ఈ చర్యలు తీసుకున్నారు.
దీంతో, అక్రమాలకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీఓ చిన్నయ్య స్వయంగా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినప్పటికీ, సంబంధిత నిందితులను అరెస్ట్ చేయడంలో సీఐ శ్రీరామ్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారనే ఆరోపణలు వచ్చాయి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు గానూ డీఐజీ కోయ ప్రవీణ్ సీఐ శ్రీరామ్‌ను తక్షణమే వీఆర్‌కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.