హుస్సేన్ సాగర్‌లో దూకిన సూడాన్ జాతీయుడు.. కాపాడిన పోలీసులు

Sudanese national jumps into Hussain Sagar Police rescue him
  • హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో సూడాన్ యువకుడి ఆత్మహత్యాయత్నం
  • తాడు సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన పోలీసులు
  • బాధితుడు టోలిచౌకిలో నివసించే నజర్ ఆడమ్‌గా గుర్తింపు
  • ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై లేక్ పోలీసులు దర్యాప్తు
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో ఆత్మహత్యకు యత్నించిన ఓ సూడాన్ జాతీయుడిని పోలీసులు రక్షించారు. బుధవారం తెల్లవారుజామున సచివాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీలో నివసించే నజర్ ఆడమ్ బడా వేగా (25)గా పోలీసులు గుర్తించారు.

బుధవారం ఉదయం నజర్ ఆడమ్ సాగర్‌లోకి దూకడాన్ని గమనించిన విధుల్లో ఉన్న సైఫాబాద్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తాడు సాయంతో అతడిని సురక్షితంగా బయటకు లాగి ప్రాణాపాయం నుంచి తప్పించారు. బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, తదుపరి విచారణ నిమిత్తం కేసును లేక్ పోలీసులకు అప్పగించారు. సదరు యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Nazar Adam Bada Vega
Hussain Sagar suicide attempt
Sudanese national Hyderabad
Hyderabad Police rescue

More Telugu News