తెలంగాణలో ‘టాక్సిక్‌’ సినిమా టికెట్‌ ధరల పెంపునకు అనుమతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో ‘టాక్సిక్‌’ సినిమా టికెట్‌ ధరల పెంపునకు అనుమతి

Toxic movie ticket price hike permitted by Telangana government
  • ఆగస్టు 26న ‘టాక్సిక్‌’ ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • తెలంగాణలో టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వ అనుమతి
  • సింగిల్‌ స్క్రీన్‌లో రూ.50 పెంపునకు అవకాశం
  • మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకునేందుకు అనుమతి
  • పెంచిన ధరలు పది రోజుల పాటు అమల్లో
యశ్‌ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘టాక్సిక్‌’ విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 చొప్పున పెంచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పెంపు మొత్తాల్లో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది. పెంచిన టికెట్‌ ధరలు 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఈ సమయంలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

అదే సమయంలో ‘టాక్సిక్‌’ నిర్మాణ సంస్థ కేవీయన్‌ ప్రొడక్షన్స్‌ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ కమిటీకి రూ.కోటి డిపాజిట్‌ చేయాలని ప్రభుత్వం సూచించింది.

నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్‌, తారా సుతారియా, హ్యుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. వైవిధ్యమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా గీతూ మోహన్‌దాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాలను బట్టి తెలుస్తోంది.

కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ‘టాక్సిక్‌’ విడుదల కానుంది. ఈ సినిమా నిడివి 3 గంటల 14 నిమిషాలు.
Advertisement
Yash
Toxic Movie
Telangana Government
Ticket Price Hike
Geetu Mohandas
KVN Productions

More Telugu News