శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య

Srisailam tragedy Five members of a family commit suicide
  • శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో విషాదం
  • శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన కుటుంబం ఆత్మహత్య
  • మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలింపు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన తీవ్ర కలకలం రేపింది. శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఈ విషాదం చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే... శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన సుధాకర్, ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠ అనే ఐదుగురు కుటుంబ సభ్యులు ఈ నెల 20న శ్రీశైలానికి వచ్చి వడ్డెర సత్రంలో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. గదిలోకి వెళ్లిన తర్వాత వారు తలుపులు వేసుకుని బయటకు రాలేదు. గత మూడు రోజులుగా గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సత్రం సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గది తలుపులు తెరిచి చూడగా... ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఆత్మహత్య చేసుకుని మృతి చెంది కనిపించారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పవిత్రమైన శ్రావణమాసంలో శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఇలాంటి విషాదం జరగడం స్థానికులను, భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Advertisement
Srisailam
Family suicide
Vaddera Satram
Sri Sathya Sai district
Battalapalli family
Srisailam police

More Telugu News