గడ్కరీ నోట రిటైర్‌మెంట్ మాట.. కేంద్ర క్యాబినెట్‌లో కీలక మార్పులు?
- కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాలన్న నితిన్ గడ్కరీ
- గతంలోలా ఎక్కువగా పనిచేయలేకపోతున్నానన్న కేంద్ర మంత్రి
- 30 ఏళ్ల ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు
- యువతకు పని చేసే అవకాశం ఇవ్వాలని సూచన
- బీజేపీ సంస్థాగత మార్పుల నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం
నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో మాదిరిగా ఎక్కువగా పనిచేయలేనని, ఇప్పుడు కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
దాదాపు 30 ఏళ్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, విజయాలు చూశానని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ప్రజా కార్యక్రమాల్లో తన ప్రమేయం తగ్గిందని, యువతకు పని చేసే అవకాశం కల్పించాలన్నారు.
అయితే రానున్న రోజుల్లో అభివృద్ధి పనుల వేగం మరింత పెరగాల్సి ఉందని చెప్పారు. మహారాష్ట్రలో ఏ గిరిజన గ్రామం కూడా విద్యుత్ సౌకర్యం లేకుండా ఉండకూడదనేది తన లక్ష్యమని పేర్కొన్నారు.
ఇటీవల బీజేపీ జాతీయ సంస్థాగత బృందంలో భారీ మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొత్త జాతీయ బృందంలో 51 మంది కొత్తవారికి చోటు కల్పించడంతో పార్టీలో తరాల మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌లోనూ మార్పులు ఉంటాయనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి.