కారుపై 3,400 ముద్దులు.. రంగంలోకి పోలీసులు.. చివరకు ఏమైందంటే?

Aditya Sikarwar car with 3400 lipstick kisses leads to police action and fine
  • 3,400 ముద్దుల గుర్తులతో గ్వాలియర్‌ కారు వైరల్‌
  • ఆదిత్య సికర్వార్‌ కారును ముద్దులతో అలంకరించిన ప్రియురాలు
  • ముద్దులు ఇచ్చేందుకు నాలుగు గంటల సమయం
  • వాహన యజమానిని పిలిపించి పోలీసుల ప్రశ్న
  • వాహనాన్ని పూర్తిగా కడిగించిన పోలీసులు
గ్వాలియర్‌లో ఓ కారు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కారంతా లిప్‌స్టిక్‌ ముద్దుల గుర్తులతో నిండిపోవడమే ఇందుకు కారణం. అయితే ఈ వెరైటీ అలంకరణ కారు యజమాని ఆదిత్య సికర్వార్‌కు చివరకు రూ.5,500 జరిమానా తెచ్చిపెట్టింది.

ఆదిత్య ప్రియురాలు విదేశీ సోషల్‌ మీడియా ట్రెండ్‌తో స్ఫూర్తి పొంది కారును ఇలా అలంకరించింది. ఒక్కో ముద్దు గుర్తును వేస్తూ దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించింది. మొత్తంగా సుమారు 3,400 లిప్‌స్టిక్‌ ముద్దుల గుర్తులు కారుపై కనిపించాయి. దీంతో రోడ్డుపై ఎక్కడికి వెళ్లినా ఆ కారు అందరి దృష్టినీ ఆకర్షించింది.

కారుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఫొటోల్లో కనిపించిన రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. అనంతరం కారును స్వాధీనం చేసుకుని యజమాని ఆదిత్యను పిలిపించి ప్రశ్నించారు.

ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనకు రూ.5,500 చలానా విధించారు. దీంతో ఆదిత్య తన తప్పును అంగీకరించాడు. ఆ తర్వాత కారుపై ఉన్న లిప్‌స్టిక్‌ ముద్దుల గుర్తులన్నింటినీ తొలగింపజేశారు. వాహనాన్ని పూర్తిగా కడిగించారు.
Advertisement
Aditya Sikarwar
Gwalior lipstick car
Traffic police fine
Viral lipstick kiss car
Social media trend car decoration
Madhya Pradesh traffic violation

More Telugu News