'ఇరుముడి' ఈవెంట్ లో కొమరం కన్నీళ్లు .. ఆయన ఆవేదనలో అర్థముంది పాపం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఇరుముడి' ఈవెంట్ లో కొమరం కన్నీళ్లు .. ఆయన ఆవేదనలో అర్థముంది పాపం!

Komaram Special
  • 'కొమరక్క'గా అలరిస్తూ వస్తున్న కొమరం
  • 12 ఏళ్లుగా ఒకే పాత్రలో కొనసాగుతున్నానంటూ కన్నీళ్లు 
  • 'ఇరుముడి' సినిమాలో 'నాగులు'గా గుర్తింపు
  • ఎలాంటి పాత్రనైనా చేయగలనని వెల్లడి 
  • శివ నిర్వాణకి కృతజ్ఞతలు తెలిపిన కొమరం
  
సినిమా ప్రపంచంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటి ఒక బ్రేక్ కొంతమందికి వెంటనే రావొచ్చు .. కొంతమందికి కొంతకాలం పట్టొచ్చు .. మరికొంతమందికి ఎప్పటికీ రాకపోవచ్చు కూడా. అందరూ ఆశించే ఆ బ్రేక్ వచ్చే వరకూ అవకాశాలు వస్తాయని కూడా చెప్పలేని ఒక అయోమయ పరిస్థితి ఇక్కడ ఉంటుంది. వచ్చిన ప్రతి పాత్ర నచ్చాలని లేదు. నచ్చిన పాత్రమే చేస్తానంటే కుదరదు. అలా ఇక్కడి జీవితాలు ఊగిసలాడుతూనే ఉంటాయి. 

అలాంటి నిరాశ నిస్పృహల మధ్య ఒక డిఫరెంట్ రోల్ పడితే .. ఆ రోల్ కి మంచి పేరు వస్తే .. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే .. ఇక ఆ సంతోషానికి హద్దులు ఉండవు. అలాంటి ఒక ఆనందంలో కొమరం మునిగి తేలుతున్నాడు. 'ఇరుముడి' సినిమాలో ఆయన పోషించిన 'నాగులు' పాత్రకి మంచి గుర్తింపు రావడమే అందుకు కారణం. 'కొమరక్క'గా టీవీలలో కనిపిస్తూ వచ్చిన 'కొమరం' ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించి షాక్ ఇచ్చాడు. ఆ సినిమాలో ఆయన నటన ఆడియన్స్ కి నచ్చేసింది. ఈ తరహా పాత్రలు కూడా 'కొమరం' గొప్పగా చేయగలడనే ఒక నమ్మకం వచ్చింది'

 తాను ఇండస్ట్రీకి వచ్చిన 18 ఏళ్లలో .. 12 ఏళ్లనుంచి 'కొమరక్క'గా లేడీ గెటప్ లోనే కనిపిస్తూ వస్తున్నాననీ, తాను ఆ పాత్ర తప్ప వేరే ఏవీ చేయలేనని చెప్పుకున్నారని అన్నాడు. ఇకపై తనని 'కొమరక్క'గా కాకుండా 'నాగులు'గా గుర్తుపెట్టుకునేలా 'ఇరుముడి' చేసిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిజంగానే కొమరం కన్నీళ్లకో అర్థం ఉందని ఎవరికైనా అనిపిస్తుంది. తనని నటుడిగా నిరూపించుకునే ఒక అవకాశం ఒక నటుడిని ఎంతగా కదిలిస్తుందనేది స్టేజ్ పై కొమరంను చూస్తే అర్థమవుతుంది. ఇకపై కొమరానికి డిఫరెంట్ రోల్స్ రావాలనీ .. నటుడిగా ఆయనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించే అవకాశాలు రావాలని ఆశిద్దాం.

Advertisement
Komaram
Irumudi Movie
Nagulu Character
Komaraka
Telugu Actor Komaram
Irumudi Event

More Telugu News