మహిళల ఏపీఎల్‌కు వేళాయె.. విజయవాడలో రేపే ప్లేయర్ల వేలం
- మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు రంగం సిద్ధం
- మంగళవారం విజయవాడలో క్రీడాకారిణుల వేలం
- నాలుగు ఫ్రాంచైజీల మధ్య 191 మంది కోసం పోటీ
- టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మిథాలీ రాజ్
- సెప్టెంబర్ 15 నుంచి మంగళగిరిలో మ్యాచ్‌ల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) 2026కు సర్వం సిద్ధమైంది. ఈ లీగ్‌లో తొలి అడుగుగా క్రీడాకారిణుల వేలం ప్రక్రియ ఆగస్టు 25, మంగళవారం విజయవాడలో జరగనుంది. రాష్ట్రంలో పూర్తిస్థాయి ఫ్రాంచైజీ ఫార్మాట్‌లో మహిళల టీ20 లీగ్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ వేలంలో మొత్తం 191 మంది క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అమరావతి ఇ-ఛాంపియన్స్, రాయలసీమ జెన్ స్టార్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ పేరుతో నాలుగు ఫ్రాంచైజీలు ఈ వేలంలో పాల్గొననున్నాయి. ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా రూ. 15 లక్షల పర్స్‌తో బరిలోకి దిగనుండగా, కనీసం రూ. 13.5 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కో జట్టులో 18 నుంచి 20 మంది క్రీడాకారిణులను ఎంపిక చేసుకోవాలి.
వేలం కోసం క్రీడాకారిణులను రెండు గ్రేడ్‌లుగా విభజించారు. భారత జట్టుకు, డబ్ల్యూపీఎల్‌కు ప్రాతినిధ్యం వహించిన వారితో పాటు సీనియర్, అండర్-23 రాష్ట్ర స్థాయి క్రీడాకారిణులను గ్రేడ్-ఏలో చేర్చారు. వీరి కనీస ధర రూ. 50,000గా నిర్ణయించారు. ఇక జిల్లా, జోనల్ స్థాయిలో ఆడిన క్రీడాకారిణులను గ్రేడ్-బిలో ఉంచి, వారి కనీస ధరను రూ. 30,000గా ఖరారు చేశారు.
ఇటీవల జరిగిన ఫ్రాంచైజీల బిడ్డింగ్‌లో ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ అత్యధికంగా రూ. 89 లక్షలకు అమరావతి ఇ-ఛాంపియన్స్ జట్టును దక్కించుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ ఆక్షనీర్ శ్వేతా బాల్ ఈ వేలాన్ని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు జరగనున్న ఈ టోర్నమెంట్‌లోని మ్యాచ్‌లన్నీ మంగళగిరిలోని ఏసీఏ స్టేడియం వేదికగా జరగనున్నాయి.