కంగనా రనౌత్ వర్సెస్ తాప్సీ.. మళ్లీ మాటల యుద్ధం

Kangana Ranaut vs Taapsee war of words again
  • తన పెంపకం గురించి తాప్సీ మాట్లాడటంపై కంగనా ఆగ్రహం
  • తాప్సీ తల్లిదండ్రులపై కంగనా వ్యాఖ్యలు
  • తన బీ-గ్రేడ్ సినిమా ప్రమోషన్ కోసం బయటకు వచ్చారని ఎద్దేవా
బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, తాప్సీ పన్నుల మధ్య మాటల యుద్ధం మరోసారి తారాస్థాయికి చేరింది. గతంలో తమ మధ్య తలెత్తిన విభేదాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాప్సీ ప్రస్తావించడంతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది. తాప్సీ చేసిన వ్యాఖ్యలపై కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌‌ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తాప్సీ ఏమన్నారు?


తాను కంగనా రనౌత్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని తాప్సీ పేర్కొన్నారు. కంగనాపై తనకున్న అభిప్రాయం తన పెంపకం, ఆలోచనా విధానంపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. "ఆమె పద్ధతి ఆమెది. దాన్ని బట్టే ఎవరెక్కడి నుంచి వచ్చారో అర్థమవుతుంది" అని తాప్సీ వ్యాఖ్యానించారు.

తీవ్రంగా స్పందించిన కంగనా

తాప్సీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ అంతే ఘాటుగా స్పందించారు. తాప్సీ తన 'బీ-గ్రేడ్' సినిమా ప్రమోషన్ కోసమే మళ్లీ తనపై వ్యాఖ్యలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే తన పేరు వాడుకుని వార్తల్లో నిలవాలని చూస్తోందని ఆరోపించారు. తన పెంపకం, తల్లిదండ్రుల గురించి మాట్లాడటం ద్వారా తాప్సీ హద్దులు దాటిందని కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ ఇతరుల తల్లిదండ్రులను వివాదాల్లోకి లాగనని అన్నారు. "ఒక అసలైన బిడ్డకు తాప్సీ తల్లిదండ్రులు ఎందుకు జన్మనివ్వలేకపోయారోనని ఆశ్చర్యంగా ఉంది. అలాంటి చౌకబారు నకలుకు జన్మనిచ్చినందుకు వారిని చూస్తే జాలి వేస్తోంది" అంటూ ఎదురుదాడికి దిగారు.

2019లో కంగనా సోదరి రంగోలి తొలిసారి తాప్సీని 'సస్తీ కాపీ' అని సంబోధించడంతో ఈ వివాదం మొదలైంది. 2020లో కంగనా కూడా తాప్సీని 'బీ-గ్రేడ్' నటి అని విమర్శించడంతో ఇది మరింత ముదిరింది. కాగా, తాను రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఇదే ఇంటర్వ్యూలో తాప్సీ స్పష్టం చేశారు. ఆమె నటించిన 'గాంధారి' అనే రివెంజ్ డ్రామా చిత్రం సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
Advertisement
Kangana Ranaut
Taapsee Pannu
Bollywood Controversy
Gandhari Movie
Kangana vs Taapsee
Entertainment News

More Telugu News