సౌదీ-పాక్-టర్కీ రక్షణ కూటమిలో చేరేందుకు బంగ్లాదేశ్ ఆసక్తి
- సంచలన ప్రకటన చేసిన బంగ్లాదేశ్ ప్రధాని ముఖ్య సలహాదారుడు హుమయూన్
- మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ లో చేరేందుకు సానుకూలంగా ఉన్నామని వెల్లడి
- జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామన్న హుమయూన్
సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీల మధ్య ఇటీవల కుదిరిన చారిత్రాత్మక రక్షణ ఒప్పందం 'మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్'లో చేరేందుకు బంగ్లాదేశ్ సానుకూలంగా ఉన్నట్లు ఆ దేశ ప్రధాని ముఖ్య సలహాదారు హుమయూన్ కబీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌదీ-పాక్-టర్కీ త్రైపాక్షిక రక్షణ కూటమిలో బంగ్లాదేశ్ చేరడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... బంగ్లాదేశ్ తమ జాతీయ ప్రయోజనాలను, భద్రతా సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఒప్పందంలో చేరే అంశాన్ని పరిశీలిస్తోందని ప్రధాని సలహాదారు హుమాయున్ కబీర్ తెలిపారు.
సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీలు ఈ భద్రతా ఒప్పందంపై సంతకాలు చేశాయి. నాటోలోని 'ఆర్టికల్ 5' నిబంధన మాదిరిగానే, ఈ కూటమిలోని ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా దానిని మిగిలిన సభ్య దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తూ సంయుక్త ప్రతిఘటన చేపడతారు.
టర్కీ ఇప్పటికే బంగ్లాదేశ్‌కు నాలుగో అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉన్న నేపథ్యంలో, బంగ్లాదేశ్ కూడా ఈ కూటమి వైపు మొగ్గు చూపడం దక్షిణాసియా, పశ్చిమ ఆసియా భద్రతా సమీకరణాలపై, ముఖ్యంగా పొరుగున ఉన్న భారత్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.