నెల్లూరు జిల్లాలో కార్డన్ సెర్చ్.. తండ్రి గుట్టు బయటపెట్టిన చిన్నారి... వీడియో ఇదిగో!

Nellore Cordon Search Child Reveals Fathers Secret Video Here
  • నెల్లూరు జిల్లాలో పోలీసుల కార్డన్ సెర్చ్
  • తనిఖీలకు భయపడి బైక్‌ను దాచిపెట్టిన తండ్రి
  • విషయాన్ని పోలీసులకు చెప్పేసిన ఆరేళ్ల కుమారుడు
  • బాలుడి అమాయకత్వానికి ఆశ్చర్యపోయిన పోలీసులు
నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఆరేళ్ల బాలుడి అమాయకత్వం పోలీసులను విస్మయానికి గురిచేసింది. పోలీసుల తనిఖీలకు భయపడి తన తండ్రి దాచిపెట్టిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులకు చూపిస్తూ ఆ బాలుడు ఆయన్ను పట్టించాడు.

అనంతసాగరం గ్రామంలో ఈ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. అనంతసాగరంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి, ప్రతి ఇంటినీ, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులను చూసి ఆందోళన చెందాడు. తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వెంటనే తన బైక్‌ను సమీపంలోని మరో వీధిలోకి తీసుకెళ్లి దాచిపెట్టాడు.

తండ్రి చేస్తున్న పనిని గమనించిన ఆరేళ్ల కుమారుడు మహేంద్ర, నేరుగా తనిఖీలు చేస్తున్న పోలీసుల వద్దకు వెళ్లాడు. "మా నాన్న మిమ్మల్ని చూసి బైక్‌ను వేరే చోట దాచారు, రండి చూపిస్తా" అంటూ అమాయకంగా చెప్పాడు. ఆ బాలుడి మాటలకు పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ చిన్నారి పోలీసులను వెంటబెట్టుకెళ్లి తన తండ్రి బైక్‌ను దాచిన ప్రదేశాన్ని చూపించాడు.
Advertisement
Nellore Police
Cordon Search
Ananthasagaram
Child reveals father secret
Andhra Pradesh Police
Bike inspection

More Telugu News