క్రెడిట్ కార్డు బిల్లు సెటిల్ చేస్తున్నారా?.. మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడొచ్చు!
- మొత్తం బకాయి చెల్లిస్తే ఖాతా ‘క్లోజ్డ్’గా నమోదు
- తక్కువ మొత్తంతో ఒప్పందం చేసుకుంటే ‘సెటిల్డ్’గా నమోదు
- ‘సెటిల్డ్’ ఖాతాను రుణదాతలు ప్రతికూలంగా చూసే అవకాశం
- భవిష్యత్తులో రుణాలు, కొత్త క్రెడిట్ కార్డులకు ఇబ్బందులు వచ్చే ఛాన్స్
- తర్వాత మిగిలిన బకాయి చెల్లించి స్టేటస్‌ను మార్చుకునే అవకాశం
క్రెడిట్ కార్డు బిల్లు భారీగా పెరిగిపోయి.. మొత్తం చెల్లించడం కష్టంగా మారినప్పుడు బ్యాంకులు సెటిల్‌మెంట్ అవకాశం ఇస్తుంటాయి. ఉదాహరణకు రూ.1 లక్ష బకాయి ఉంటే రూ.60 వేలు చెల్లించి ఖాతాను ముగించుకోవచ్చు. వెంటనే ఆర్థిక భారం తగ్గినట్టే అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం ఉంది. బిల్లు మొత్తాన్ని చెల్లించి ఖాతా మూసేయడం, తక్కువ మొత్తంతో సెటిల్ చేయడం రెండూ ఒకటి కాదు.
‘క్లోజ్డ్’.. ‘సెటిల్డ్’ మధ్య తేడా
మొత్తం బకాయిని చెల్లిస్తే క్రెడిట్ బ్యూరోలో ఖాతా సాధారణంగా ‘క్లోజ్డ్’గా నమోదవుతుంది. బకాయిలో కొంత మాత్రమే చెల్లించి రుణదాత అంగీకరిస్తే ‘సెటిల్డ్’గా నమోదు చేస్తారు. రుణదాతలు సెటిల్డ్ ఖాతాలను సాధారణంగా సానుకూలంగా చూడరు. అసలు బకాయి మొత్తం తిరిగి చెల్లించలేకపోయారనే సంకేతంగా పరిగణించే అవకాశం ఉంది.
రుణం తీసుకునేటప్పుడు ఇబ్బందులు
సెటిల్డ్ ఖాతా మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. భవిష్యత్తులో గృహ రుణం, వ్యక్తిగత రుణం లేదా కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు రుణదాతలు ఈ వివరాలను పరిశీలించే అవకాశం ఉంది. గతంలో సెటిల్డ్ ఖాతా ఉండటాన్ని అధిక రుణ చెల్లింపు ప్రమాదానికి సంకేతంగా భావించవచ్చు. కొన్ని సందర్భాల్లో రుణ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది.
బిల్లు కట్టలేని పరిస్థితుల్లో..
అయితే బకాయిని అలా వదిలేయడం కంటే సెటిల్‌మెంట్ మెరుగైన మార్గంగా మారొచ్చు. చెల్లింపులు ఆగిపోతే వడ్డీ, ఆలస్య రుసుములు పెరుగుతూనే ఉంటాయి. పూర్తిగా చెల్లించే పరిస్థితి లేకపోతే రుణదాతతో చర్చించి సెటిల్ చేసుకోవడం తక్షణ ఆర్థిక ఒత్తిడిని తగ్గించవచ్చు. అయితే దీని ప్రభావం భవిష్యత్తులో క్రెడిట్ పొందడంపై ఉండొచ్చని గుర్తుంచుకోవాలి.
తర్వాత ‘క్లోజ్డ్’గా మార్చుకోవచ్చా?
కొన్ని సందర్భాల్లో మార్గం ఉంటుంది. మిగిలిన బకాయిని తర్వాత పూర్తిగా చెల్లించి, రుణదాత నుంచి ‘నో ఆబ్జెక్షన్’ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. అనంతరం క్రెడిట్ బ్యూరోలో వివాదాన్ని నమోదు చేస్తే.. బ్యాంకు నిర్ధారణ తర్వాత ఖాతా స్థితిని ‘సెటిల్డ్’ నుంచి ‘క్లోజ్డ్’గా మార్చే అవకాశం ఉంటుంది. ఇందుకోసం చెల్లింపు రసీదులు, సెటిల్‌మెంట్ లేఖ, ఎన్‌ఓసీ వంటి పత్రాలను భద్రంగా ఉంచుకోవాలి.
సెటిల్‌మెంట్ చేసిన తర్వాత క్రెడిట్ రిపోర్టును కూడా తనిఖీ చేయాలి. ఖాతా స్థితి, బకాయి వివరాలు ఒప్పందానికి అనుగుణంగా ఉన్నాయో? లేదో? చూసుకోవాలి. ఏదైనా తప్పుగా నమోదైతే రుణదాతను, క్రెడిట్ బ్యూరోను సంప్రదించి సరిచేయించుకోవాలి.