ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 24,252 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
- 3.11 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 20.15 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- ట్రెంట్, మారుతీ సుజుకీ ఇండియా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లకు నష్టాలు
- ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఐటీ రంగాల షేర్లలో నష్టాలు
- రాణించిన మెటల్, ప్రైవేట్ బ్యాంక్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు, బాండ్ ఈల్డ్స్ పెరగడం, ముడిచమురు ధరల్లో పెరుగుదల ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి.
సెన్సెక్స్ 3.11 పాయింట్లు పెరిగి 77,540.83 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 20.15 పాయింట్లు లాభపడి 24,252.00 వద్ద ముగిసింది. నిఫ్టీ 0.08 శాతం పెరిగింది.
నిఫ్టీకి 24,000-24,200 స్థాయి కీలక మద్దతుగా ఉంటుందని మార్కెట్ నిపుణులు తెలిపారు. పైస్థాయిలో 24,300-24,400 మధ్య నిరోధం ఉందని చెప్పారు. ఈ స్థాయిని దాటితే నిఫ్టీ 24,500-24,600 వరకు పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.
ప్రధానంగా నష్టపోయిన షేర్లలో ట్రెంట్, మారుతీ సుజుకీ ఇండియా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఉన్నాయి. మరోవైపు విస్తృత మార్కెట్‌లో కొంత ఉత్సాహం కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.1 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 0.69 శాతం లాభపడ్డాయి.
రంగాల వారీగా చూస్తే ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఐటీ సూచీలు వెనుకబడ్డాయి. మెటల్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు మెరుగ్గా రాణించాయి.