ప్రణయ్ తేజ్ ఘటన నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాను: నారా లోకేశ్
- విశాఖ చిన్నారి ప్రణయ్ తేజ్ మృతి ఘటనపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆవేదన
- ఒక తండ్రిగా ఆ తల్లిదండ్రుల బాధను ఊహించలేకపోతున్నానని వ్యాఖ్య
- పాఠశాలల్లో శారీరక దండనలకు చోటులేదని స్పష్టీకరణ
- ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
పాఠశాల విద్యార్థి ప్రణయ్ తేజ్ మృతి ఘటనపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, క్రమశిక్షణ పేరుతో చిన్నారులపై హింసకు పాల్పడటాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.
"ఒక తండ్రిగా, విశాఖ చిన్నారి ప్రణయ్ తేజ్‌కు జరిగిన ఘటన గురించి నేను ఇంకా తేరుకోలేకపోతున్నాను. అతని తల్లిదండ్రులు అనుభవిస్తున్న బాధను ఊహించుకోలేను. మన పాఠశాలల్లో శారీరక దండనలకు ఏమాత్రం చోటు లేదు. క్రమశిక్షణ పేరుతో ఏ బిడ్డపైనా హింస జరగకూడదు" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ దురదృష్టకర ఘటనపై ఇప్పటికే పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ తీవ్రమైన దుఃఖ సమయంలో ప్రణయ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఇండియా టుడేలో ప్రచురితమైన కథనాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ లోకేశ్ ఈ విధంగా స్పందించారు. మంత్రి ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.