ఎండకు పెరుగుతుంది.. చలిలో తగ్గుతుంది.. ఈఫిల్ టవర్ వింత ఇదే!
- ఎండ తీవ్రత పెరిగితే ఈఫిల్ టవర్ కొన్ని మిల్లీమీటర్లు పొడుగవుతుంది
- వేడికి ఇనుము వ్యాకోచించడమే ఇందుకు కారణం
- చలిలో టవర్ మళ్లీ కొంత కుదించుకుంటుంది
- ఎండ ఎక్కువగా తగిలిన వైపు విస్తరించడంతో టవర్ స్వల్పంగా వంగుతుంది
- శిఖరం రోజులో సుమారు 15 సెం.మీ. వ్యాసంలో కదులుతుంది
ఒక్కసారి ఊహించండి.. ఉదయం పారిస్‌లో చూసిన ఈఫిల్ టవర్ సాయంత్రానికి కాస్త పొడుగైంది! మరుసటి రోజు చలి పెరగ్గానే మళ్లీ కొంచెం తగ్గిపోయింది. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమే. ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ ఎత్తు ఏడాది పొడవునా అచ్చం ఒకేలా ఉండదు. ఇనుముతో నిర్మితమైన ఈ టవర్ ఎండ తీవ్రత పెరిగితే కొన్ని మిల్లీమీటర్లు విస్తరిస్తుంది. అంటే వేసవిలో టవర్ కాస్త ‘పొడుగవుతుంది’. చలిలో మళ్లీ మునుపటి పరిమాణానికి చేరుతుంది.
దాదాపు 330 మీటర్ల ఎత్తున్న ఈ మహా కట్టడాన్ని పూర్తిగా ఇనుముతో నిర్మించారు. లోహాలు వేడెక్కినప్పుడు వ్యాకోచిస్తాయి. చల్లబడితే సంకోచిస్తాయి. ఈ సహజ భౌతిక ప్రక్రియనే ‘థర్మల్ ఎక్స్‌ప్యాన్షన్’ అంటారు. ఈఫిల్ టవర్ విషయంలో ఈ మార్పు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. నిర్మాణం అంత భారీగా ఉండటంతో ఉష్ణోగ్రతలో మార్పు దాని పరిమాణంపైనా ప్రభావం చూపుతుంది. వేసవిలో వేడి పెరిగినప్పుడు టవర్ ఎత్తు కొన్ని మిల్లీమీటర్లు పెరుగుతుంది. చలికాలంలో అంతే స్థాయిలో తగ్గుతుంది. ఈ మార్పు పర్యాటకులకు కనిపించదు. నిర్మాణానికి ఎలాంటి ప్రమాదమూ ఉండదు.
ఎత్తు మాత్రమే కాదు.. కాస్త పక్కకూ!
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. టవర్ ఎండకు కేవలం పొడవు పెరగడమే కాదు.. ఎండకు వ్యతిరేక దిశలోనూ కాస్త వంగుతుంది.
సూర్యకాంతి నాలుగు వైపులా ఒకేలా పడదు. నేరుగా ఎండ తగిలిన భాగం ఎక్కువగా వేడెక్కుతుంది. ఆ భాగంలోని ఇనుము కొంత ఎక్కువగా వ్యాకోచిస్తుంది. దీంతో మొత్తం నిర్మాణంలో స్వల్ప అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా టవర్ శిఖరం సూర్యుడికి వ్యతిరేక దిశలో కదులుతుంది.
సూర్యుడు తూర్పు నుంచి పడమర వైపు కదులుతున్న కొద్దీ ఈ కదలిక దిశ కూడా మారుతుంది. ఎండగా ఉన్న రోజులో టవర్ శిఖరం సుమారు 15 సెంటీమీటర్ల వ్యాసం ఉన్న చిన్న వృత్తంలా కదులుతుందని ఈఫిల్ టవర్ అధికారిక వెబ్‌సైట్ వెల్లడించింది.
1889లో 312 మీటర్లు..
ఇక ఈఫిల్ టవర్ ఎత్తు కాలక్రమంలో నిజంగానే పెరిగింది. 1889లో ప్రారంభించినప్పుడు దాని ఎత్తు 312 మీటర్లు. తర్వాత రేడియో, టెలివిజన్ ప్రసారాల కోసం యాంటెనాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. 2022 మార్చి 15న కొత్త డిజిటల్ రేడియో యాంటెనా ఏర్పాటు చేయడంతో మరో ఆరు మీటర్లు పెరిగింది. అప్పటి నుంచి అధికారిక ఎత్తు 330 మీటర్లు.