స్మార్ట్‌ఫోన్ తయారీలో దూసుకెళుతోన్న భారత్.. రెండేళ్లలో ప్రపంచంలో 20 శాతం వాటా!
- ప్రపంచ స్మార్ట్‌ఫోన్ తయారీలో భారత్ వాటా 18 శాతం
- మరో రెండేళ్లలో ఈ వాటా 20 శాతానికి చేరొచ్చని అంచనా
- చైనా ప్రస్తుతం 63 శాతం వాటాతో అగ్రస్థానం
- భారత్, చైనా, వియత్నాం కలిసి 90 శాతానికి పైగా ఉత్పత్తి
- చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్న కంపెనీలు
ప్రపంచ స్మార్ట్‌ఫోన్ తయారీలో భారత్ వాటా మరింత పెరగనుంది. మరో ఏడాది లేదా రెండేళ్లలో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిలో భారత్ వాటా 20 శాతానికి చేరే అవకాశం ఉందని ‘వన్ వరల్డ్ ఔట్‌లుక్’ నివేదిక తెలిపింది.
ప్రపంచ ఎలక్ట్రానిక్స్ సరఫరా వ్యవస్థలో చైనాకు ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా భారత్ వేగంగా ఎదుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కంపెనీలు ఇతర దేశాల్లో తయారీని విస్తరిస్తున్నాయి. ఈ వ్యూహాన్ని ‘చైనా ప్లస్ వన్’గా వ్యవహరిస్తున్నారు.
కొవిడ్ సమయంలో సరఫరా వ్యవస్థల్లో తలెత్తిన అంతరాయాలు ఈ మార్పునకు ప్రధాన కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సుంకాలు, కీలక సాంకేతికతలపై ఆంక్షలు కూడా కంపెనీలను తయారీ కేంద్రాలను విస్తరించేలా చేశాయి.
2025 నాటికి చైనా, భారత్, వియత్నాం కలిసి ప్రపంచ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిలో 90 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇందులో చైనా 63 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. భారత్ వాటా 18 శాతానికి చేరింది.
భారత్ వాటా వచ్చే ఒకటి, రెండేళ్లలో 20 శాతానికి పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. దీంతో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ తయారీలో ప్రతి ఐదు ఫోన్లలో ఒకటి భారత్‌లో తయారయ్యే అవకాశం ఉంది.