ఇండిగో వెబ్‌సైట్‌కు మళ్లీ అంతరాయం.. బుకింగ్స్‌కు బ్రేక్
- వెబ్ చెక్-ఇన్, మొబైల్ యాప్ లాగిన్‌లోనూ సమస్యలు
- ప్రధాన రిజర్వేషన్ ప్లాట్‌ఫామ్‌లో సాంకేతిక లోపమే కారణమన్న ఇండిగో
- వెబ్‌సైట్‌లో కొందరికి ‘నో డేటా అవైలబుల్’ సందేశం
- సమస్యను పరిష్కస్తున్నామని సంస్థ ప్రకటన
- సేవలు పూర్తిగా ఎప్పటికి పునరుద్ధరిస్తారో లేని స్పష్టత
దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో ఆన్‌లైన్ సేవలకు శుక్రవారం మరోసారి అంతరాయం ఏర్పడింది. దీంతో పలువురు ప్రయాణికులు విమాన టికెట్లు బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెబ్ చెక్-ఇన్ సేవలు కూడా కొంతమందికి అందుబాటులో లేకపోయాయి. మొబైల్ యాప్‌లో లాగిన్ కావడంలోనూ సమస్యలు తలెత్తినట్లు ప్రయాణికులు తెలిపారు.
ఈ సమస్యపై ఇండిగో స్పందించింది. తమ ప్రధాన రిజర్వేషన్ ప్లాట్‌ఫామ్‌లో అడపాదడపా సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు వెల్లడించింది. దీనివల్ల కొందరు వినియోగదారులు ఆన్‌లైన్ సేవలను పొందడంలో ఇబ్బంది పడవచ్చని తెలిపింది. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తమ బృందాలు టెక్నాలజీ భాగస్వామితో కలిసి అత్యవసరంగా పనిచేస్తున్నట్లు ఇండిగో పేర్కొంది.
అంతరాయం సమయంలో విమాన బుకింగ్ సేవలు తెరవడానికి ప్రయత్నించిన వారికి వెబ్‌సైట్‌లో ‘నో డేటా అవైలబుల్’ సందేశం కనిపించింది. పలువురు ప్రయాణికులు ఇండిగో అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఫిర్యాదులు చేశారు. బుకింగ్స్ విఫలమవుతున్నాయని, వెబ్ చెక్-ఇన్ కావడం లేదని, చెల్లింపులకు నిర్ధారణ సందేశాలు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు.
వారం వ్యవధిలో ఇండిగో రిజర్వేషన్ వ్యవస్థలో రెండోసారి సమస్య తలెత్తడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. రెండు రోజుల క్రితమే ఇదే తరహా అంతరాయం ఏర్పడింది. తాజా సమస్యకు కారణమేంటో, ఏ టెక్నాలజీ భాగస్వామితో కలిసి పరిష్కార చర్యలు చేపడుతున్నారో ఇండిగో వెల్లడించలేదు. సేవలు పూర్తిస్థాయిలో ఎప్పటికి పునరుద్ధరిస్తారన్న దానిపైనా స్పష్టత ఇవ్వలేదు.