భూమిపై భారీ ఉల్కాపాతం.. వయసు లెక్కింపులో 10 కోట్ల సంవత్సరాలు తక్కువగా నిర్ధారణ
- ఓక్లహామాలోని ఏమ్స్ ఉల్కాపాతం క్రేటర్ వయసుపై కొత్త పరిశోధన
- గత అంచనా కంటే 10 కోట్ల సంవత్సరాలు తక్కువ వయసు అని నిర్ధారణ
- గతంలో 46.7 కోట్లు ఏళ్లు కాగా, ఇప్పుడు 37 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడినట్లు గుర్తింపు
- జిర్కాన్ డేటింగ్ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తల తాజా అంచనా
- భారీ జీవరాశుల వినాశనం జరిగిన కాలానికి దగ్గరగా ఈ సంఘటన
అమెరికాలోని ఓక్లహామాలో ఉన్న ఏమ్స్ ఉల్కాపాతం క్రేటర్ (బిలం) వయసును శాస్త్రవేత్తలు సవరించారు. గతంలో భావించినట్లుగా ఇది 46.7 కోట్ల ఏళ్ల క్రితం కాకుండా, సుమారు 37 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిందని టెక్సాస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తేల్చారు. అంటే, ఇప్పటివరకు ఉన్న అంచనా కంటే దీని వయసు దాదాపు 10 కోట్ల సంవత్సరాలు తక్కువ. ఈ కొత్త ఆవిష్కరణతో, భూమిపై భారీస్థాయిలో జీవరాశులు అంతరించిన కాలానికి ఈ ఉల్కాపాత సంఘటన దగ్గరగా జరిగినట్లు తెలుస్తోంది.
ఓక్లహామాలోని ఏమ్స్ పట్టణం కింద కొన్ని మైళ్ల వెడల్పున ఈ బిలం విస్తరించి ఉంది. దశాబ్దాలుగా ఈ బిలం 'ఆర్డోవిషియన్ ఉల్కాపాత ఘటన'కు సంబంధించిందని భావిస్తూ వచ్చారు. ఆ బిలంలో లభించిన పురాతన జీవుల దంతాల అవశేషాల (కానోడాంట్ శిలాజాలు) ఆధారంగా గతంలో వయసును లెక్కించారు. అయితే, ఎలిజబెత్ క్యాట్లాస్ నేతృత్వంలోని పరిశోధక బృందం, ఉల్కాపాతం వల్ల కరిగిన రాళ్లలోని జిర్కాన్ స్ఫటికాలపై యురేనియం-లెడ్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించి కొత్త వయసును కనుగొంది.
తాజా పరిశోధన ప్రకారం, ఈ బిలం వయసు 36.97 కోట్ల సంవత్సరాలుగా నిర్ధారణ అయింది. ఉల్కాపాతం జరిగినప్పుడు, అంతకుముందే అక్కడ ఉన్న శిలల్లోని పాత శిలాజాలు బిలంలో కలిసిపోయాయని, అందుకే పాత అంచనాలు తప్పుగా వచ్చాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ కొత్త కాలక్రమం ప్రకారం, ఈ ఉల్కాపాతం సుమారు 37.2 కోట్ల ఏళ్ల క్రితం సముద్ర జీవరాశిని నాశనం చేసిన భారీ వినాశనానికి దగ్గరగా జరిగింది.
ఈ ఉల్కాపాతమే ఆ జీవరాశుల వినాశనానికి కారణమని కచ్చితంగా చెప్పలేనప్పటికీ, ఆ విపత్కర కాలంలోనే ఇది జరగడం కీలక పరిణామమని పరిశోధకులు అంటున్నారు. నమూనాలు పరిమితంగా ఉన్నందున, మరిన్ని పరిశోధనలు చేస్తే ఈ అంచనాలు మరింత బలపడతాయని వారు పేర్కొన్నారు. ఈ కొత్త ఆవిష్కరణ ఉత్తర అమెరికాలో పురాతన ఉల్కాపాతాల విస్తరణపై అవగాహనను కూడా మార్చనుంది.