జగన్‌కు ఏపీపీఎస్సీ, డీఎస్సీకి తేడా తెలియదు: ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి ఎద్దేవా

Julakanti Brahmananda Reddy mocks Jagan over APPSC and DSC confusion
  • ఏపీపీఎస్సీ, డీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్ అని విమర్శ
  • గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నిర్వహించలేదని ఆరోపణ
  • జగన్‌కు వయోజన విద్య కింద చదువు చెప్పించాలని లోకేశ్‌కు విజ్ఞప్తి
  • గొడ్డలి పార్టీ నాయకులకు నిరుద్యోగుల కన్నీళ్లు కనపడవని వ్యాఖ్య
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి మధ్య తేడా తెలియని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ జగన్ రెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు. నెల రోజుల పాటు పరిశోధన చేసి, ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండూ ఒకటేనని కనుగొన్న గొప్ప మేధావి జగన్ అంటూ సెటైర్లు వేశారు.

ఈ సందర్భంగా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ.. "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే పరీక్షలపై జగన్‌కు కనీస అవగాహన లేదు. టీచర్ పోస్టులకు, గ్రూప్-1 పోస్టులకు తేడా తెలియని గొడ్డలి పార్టీ అధినేత ఆయన. గత ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా యువతను గంజాయికి బానిసలను చేశారు. నిరుద్యోగుల జీవితాలతో రాజకీయం చేయడం మాత్రం వారికి బాగా తెలుసు" అని ఆరోపించారు.

"కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే కోర్టు కేసులు వేయించడం, గతంలో ఉద్యోగం అడిగితే వాలంటీర్ పోస్టులు ఇవ్వడం గొడ్డలి పార్టీ నైజం. గొడ్డలి వేటు లెక్కలు తెలిసిన వారికి నిరుద్యోగి కన్నీటి విలువ ఏం తెలుస్తుంది?" అని ఆయన ప్రశ్నించారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పెద్ద మనసు చేసుకుని, వయోజన విద్యా పథకం కింద జగన్‌కు చదువు చెప్పించాలని బ్రహ్మానంద రెడ్డి విజ్ఞప్తి చేశారు. లేదంటే.. టీచర్లను మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టినట్లు, భవిష్యత్తులో మెకానిక్‌లను డాక్టర్లుగా, డాక్టర్లను తాపీ మేస్త్రీలుగా చెప్పే ప్రమాదం ఉందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Advertisement
Julakanti Brahmananda Reddy
YS Jagan Mohan Reddy
APPSC vs DSC
Macherla MLA
Andhra Pradesh Job Notifications
Nara Lokesh

More Telugu News