టాలీవుడ్‌లో విషాదం.. దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత
- చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
- శుక్రవారం మధ్యాహ్నం మరణించినట్లు నాజర్ వెల్లడి
- వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన దిగ్గజ నటి
- 1950లో ‘షావుకారు’ చిత్రంతో సినీ అరంగేట్రం
- 2022లో పద్మశ్రీ పురస్కారం
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఇటీవలే ఆమె చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ ప్రకటించారు.
రాజమహేంద్రవరానికి చెందిన శంకరమంచి జానకి, సినీ రంగంలో ‘షావుకారు జానకి’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1950లో ఎల్‌వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ‘షావుకారు’తో ఆమె వెండితెర అరంగేట్రం చేశారు. ఆ సినిమా విజయం తర్వాతే ఆమె పేరుకు ముందు ‘షావుకారు’ చేరింది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఆమె సుదీర్ఘ సినీ ప్రయాణం సాగింది. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. వెండితెరతో పాటు బుల్లితెరపైనా నటించారు. ఇటీవల కూడా తెలుగు సినిమాల్లో కనిపించారు. ఆమె చివరిసారిగా 2023లో విడుదలైన ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో నటించారు.
సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2022లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం అందించింది. దశాబ్దాల పాటు సాగిన ఆమె నటనా ప్రస్థానం తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది.