స్మార్ట్‌ఫోన్ల ధరల బాదుడు.. భారీగా పెంచిన ప్రముఖ కంపెనీలు
- చిప్‌సెట్లు, మెమరీ ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం
- శాంసంగ్ గెలాక్సీ మోడల్‌పై ఏకంగా రూ.12,000 పెంపు
- రానున్న రోజుల్లో మరో 7-10 శాతం పెరిగే అవకాశం
- అమ్మకాలు మందగించినా.. పండగ సీజన్ ఆఫర్లపైనే ఆశలు
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది కాస్త చేదువార్తే. ప్రముఖ మొబైల్ కంపెనీలు తమ ఫోన్ల ధరలను భారీగా పెంచేశాయి. రియల్‌మీ, ఒప్పో, వివో, శాంసంగ్, వన్‌ప్లస్ వంటి అగ్రశ్రేణి బ్రాండ్లు ఎంపిక చేసిన మోడళ్లపై ఈ పెంపును ప్రకటించాయి. ఫోన్ల తయారీలో కీలకమైన మెమరీ, చిప్‌సెట్ల ధరలు అంతర్జాతీయంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియా సంక్షోభం వంటి కారణాలతో వినియోగదారులు ఆచితూచి ఖర్చు చేస్తున్న తరుణంలో ఈ ధరల పెంపు మరింత భారం కానుంది.
ఏ కంపెనీ ఎంత పెంచిందంటే..
రియల్‌మీ: ఈ నెల 18 నుంచి పలు మోడళ్లపై రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ధరలను పెంచింది.
ఒప్పో: రెనో, ఏ సిరీస్‌లోని కొన్ని మోడళ్ల ధరలు రూ.5,000 వరకు పెరిగాయి.
వివో: కొన్ని ప్రాంతాల్లో ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.500 నుంచి రూ.4,000 వరకు పెంచింది.
శాంసంగ్: ఎస్, ఎం, ఎఫ్ సిరీస్‌లోని కొన్ని ఫోన్ల ధరలను సవరించింది. ముఖ్యంగా గెలాక్సీ ఎస్25 సిరీస్‌లోని ఒక వేరియంట్‌పై ఏకంగా రూ.12,000 పెంచడం గమనార్హం.
వన్‌ప్లస్: తమ ఫోన్ల ధరలను రూ.2,000 నుంచి రూ.4,000 శ్రేణిలో పెంచింది.
మొబైల్ విడిభాగాల ధరలు పెరుగుతున్న కారణంగా ఈ ఏడాది జూన్ నాటికే భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల సగటు ధరలు దాదాపు 15 శాతం పెరిగాయని ఐడీసీ ఏషియా పసిఫిక్ సీనియర్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి తెలిపారు. ఇదే ధోరణి కొనసాగితే రానున్న నెలల్లో మరో 7-10 శాతం వరకు ధరలు పెరగవచ్చని ఆమె అంచనా వేశారు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఆ భారాన్ని కొంత మేర వినియోగదారులపైకి బదిలీ చేయక తప్పడం లేదని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అనలిస్ట్ శభమ్ సింగ్ పేర్కొన్నారు. కంపెనీలు కొత్త మోడళ్లను కూడా అధిక ధరలతోనే విడుదల చేస్తున్నాయని ఆయన వివరించారు.
దేశంలో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు ఇప్పటికే మందగించాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమ్మకాలు గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. ఇటీవల అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో డిస్కౌంట్ల కారణంగా అమ్మకాలు కాస్త పుంజుకున్నా, ఆ తర్వాత మళ్లీ పడిపోయాయి. అయితే, రాబోయే పండగ సీజన్‌లో కంపెనీలు డిస్కౌంట్లు, ఫైనాన్సింగ్ స్కీమ్‌లు, కొత్త ఆఫర్లతో ముందుకొస్తే అమ్మకాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో అమ్మకాలు 13 శాతం తగ్గినా, ద్వితీయార్థంలో పండగ సీజన్ అమ్మకాలతో మార్కెట్ మెరుగుపడొచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.