బంగారం, వెండి ధరలు: పరుగులు పెడుతున్న పసిడి.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే!
- రికార్డు స్థాయికి చేరువలో బంగారం ధరలు
- తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.59 లక్షలు దాటిన వైనం
- కిలో వెండి ధర రూ.2.60 లక్షలకు చేరిక
- తెలుగు రాష్ట్రాల్లో ఒకేలా కొనసాగుతున్న రేట్లు
బంగారం, వెండి ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితి, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం పసిడి ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఉదయం దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
శుక్రవారం ఉదయం 6:30 గంటల సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,430గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,46,160 వద్ద నమోదైంది. అటు ముంబైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,59,280గా, 22 క్యారెట్ల ధర రూ. 1,46,010గా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన నగరాలైన నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,470 వద్ద ఉంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,60,100గా నమోదైంది.
అయితే, స్థానిక పన్నులు, ఇతర సుంకాల ఆధారంగా ఈ ధరలలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి, బంగారం కొనుగోలు చేసేవారు తమ సమీపంలోని జ్యువెలరీ దుకాణాల్లో తాజా ధరలను సరిచూసుకోవడం ఉత్తమం.