త్వరలో సోనియా గాంధీ ఆత్మకథ.. రాహుల్ గాంధీ భావోద్వేగ పోస్ట్
- రాజీవ్ గాంధీ జయంతి నాడు వివరాలు పంచుకున్న రాహుల్ గాంధీ
- అమ్మ పడిన కష్టాలు తనకు, ప్రియాంకకు మాత్రమే తెలుసన్న రాహుల్
- ప్రేమ, వివాహం, రాజకీయ జీవితంపై పుస్తకంలో కీలక అంశాలు
- నవంబర్ 10న అంతర్జాతీయంగా విడుదల కానున్న పుస్తకం
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతిని పురస్కరించుకుని, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆత్మకథకు సంబంధించిన వివరాలను వారి తనయుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ సందర్భంగా తన తల్లిని ఉద్దేశించి ఆయన 'ఎక్స్' వేదికగా ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పేరుతో వెలువడనున్న ఈ పుస్తకం ద్వారా సోనియా గాంధీ వ్యక్తిగత జీవితం విశేషాలు బాహ్య ప్రపంచానికి తెలియనున్నాయి.
"అమ్మా, నిన్ను, నాన్నను చివరిసారిగా కలిసి చూసి 35 ఏళ్లు గడిచాయి. నాన్న మనల్ని విడిచి వెళ్లిన నాటి నుంచి, జీవితంలో ఎదురైన ప్రతి సవాలును నువ్వు అంతులేని ధైర్యంతో, హుందాతనంతో ఎదుర్కోవడం నేను చూశాను. నాన్న మరణం తర్వాత నీ జీవితం ఎంతటి కష్టాల గుండా సాగిందో నాకు, ప్రియాంకకు మాత్రమే తెలుసు" అని రాహుల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన తల్లి అంతర్గత ప్రయాణాన్ని ప్రపంచంతో పంచుకోవడం గర్వంగా ఉందని, నేడు నాన్న కూడా నిన్ను చూసి ఎంతో గర్విస్తారని ఆయన ఆకాంక్షించారు.
ఈ పుస్తకాన్ని ప్రముఖ ప్రచురణ సంస్థ 'ఆల్ఫ్రెడ్ ఎ. నాఫ్' (పెంగ్విన్ రాండమ్ హౌస్) ప్రచురిస్తోంది. 2026 నవంబర్ 10న ఇది అంతర్జాతీయంగా విడుదల కానుంది. యుద్ధానంతర ఇటలీలో సోనియా బాల్యం, రాజీవ్ గాంధీతో పరిచయం, ప్రేమ, వివాహం, ఆయన హత్యానంతరం ఎదుర్కొన్న విషాదాకర పరిస్థితులు, రాజకీయ రంగప్రవేశం, 2004లో ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడం వంటి అనేక కీలక అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్టలు సమాచారం.
ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ వాద్రా సైతం స్పందిస్తూ, తన తల్లిదండ్రుల బంధం ఈ తరం గొప్ప ప్రేమకథల్లో ఒకటిగా అభివర్ణించారు. కాగా, అంతకుముందు రాహుల్ గాంధీ ఢిల్లీలోని వీర్ భూమిని సందర్శించి తన తండ్రి రాజీవ్ గాంధీ స్మృత్యర్థం ఘన నివాళులర్పించారు.