'ఇరుముడి' హిట్ ఇచ్చేసేలానే ఉందే!
- రవితేజ హీరోగా రూపొందిన 'ఇరుముడి'
- తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ చుట్టూ తిరిగే కథ
- మాస్ యాక్షన్ కి డివోషనల్ టచ్
- రేపు విడుదలవుతున్న సినిమా
- హిట్ ఖాయమంటున్న ఫ్యాన్స్
'ఇరుముడి' .. ఫీల్ తో కూడిన టైటిల్. డివోషనల్ టచ్ ఇచ్చే టైటిల్. ఈ టైటిల్ ను చూడగానే ఈ సినిమా అయ్యప్పస్వామి నేపథ్యంలో నడుస్తునని అనుకుంటారు. అయ్యప్పస్వామి భక్తుడిగా రవితేజ .. ఆ స్వామి మహిమలను చూపిస్తారని అనుకోవడం సహజం. ప్రధానమైన కథ అదే అయితే ఈ సినిమాను కార్తీక మాసంలో రిలీజ్ చేసేవారు. అయ్యప్ప మాలతో ముడిపడిన ఈ కథలో కనిపించని మరో కోణం ఉంది. అదే ఈ సినిమాను కొత్తగా ప్రేక్షకుల ముంగిట నిలపనుంది. ఆ కోణం ఏమిటనేదే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సినిమా పోస్టర్స్ ను గమనిస్తే, రవితేజ .. అతని కూతురుగా ఒక పాపను ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చారు. నిజమే ఈ కథ అంతా హీరో ప్లస్ అతని కూతురు చుట్టూనే తిరుగుతుంది. హీరో ఎవరినీ లెక్కచేయడు .. ఎవరి మాటను వినిపించుకోడు .. తన కూతురు మాట తప్ప. అలాంటి హీరోను అతని కూతురు ఎలా ప్రభావితం చేస్తుంది? అతను అయ్యప్పమాల వేసుకోవడంలోని ఆంతర్యం ఏమిటి? ఆ మాల వేసుకున్న తరువాత అతని జీవితం ఎలా మారిపోతుంది? అనే కథతో ఈ సినిమాను రూపొందించారు.
నిజానికి 2022లో వచ్చిన 'ధమాకా' తరువాత రవితేజకి పెద్ద హిట్ లేదు. ఏడెనిమిది సినిమాలు చేసినప్పటికీ అవి ఆశించినస్థాయి విజయాలను అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే 'ఇరుముడి' సిద్ధమైంది. ప్రియా భవాని శంకర్ .. బేబీ నక్షత్ర .. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, రేపు ( ఆగస్టు 21) విడుదల చేస్తున్నారు. రవితేజ సినిమా నుంచి ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయని చెబుతున్నారు. చూడాలి మరి ఈ సినిమాను ఏ స్థాయిలో ఆడియన్స్ ఆకట్టుకుంటుందో.