షూటింగ్ ఆపేశారు.. రూ.1.32 కోట్లు చెల్లించిన రాంగోపాల్ వర్మ!
- టెక్నీషియన్లకు రూ.1.32 కోట్ల బకాయిలు చెల్లించిన రాంగోపాల్
- బకాయిల వివాదంతో పోలీస్ కంపెనీ షూటింగ్‌ను అడ్డుకున్న ఎఫ్‌డబ్ల్యూఐసీఈ
- సర్కార్, సర్కార్ 3 సినిమాల బకాయిలు కూడా ఉన్నాయని ఆరోపణ
- 2019లో చెల్లిస్తానని హామీ ఇచ్చినా అమలు కాలేదని వెల్లడి
- పూర్తి మొత్తం అందిన తర్వాతే షూటింగ్‌కు అనుమతి
తొమ్మిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న టెక్నీషియన్ల బకాయిలను ఎట్టకేలకు దర్శకుడు రాంగోపాల్ వర్మ చెల్లించారు. తన కొత్త సినిమా ‘పోలీస్ కంపెనీ’ షూటింగ్‌ను సినీ కార్మికుల సంఘం అడ్డుకోవడంతో రూ.1.32 కోట్ల బకాయిలను చెల్లించినట్లు సమాచారం. పూర్తి మొత్తాన్ని అందుకున్న తర్వాతే షూటింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) తెలిపింది.
సర్కార్, సర్కార్ 3 సహా పలు సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్లకు వర్మ బకాయిలు చెల్లించాల్సి ఉందని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ తివారీ తెలిపారు. కొన్నేళ్లుగా డబ్బు చెల్లిస్తానని హామీలు ఇచ్చినా.. ఆచరణలో మాత్రం జరగలేదని ఆరోపించారు. 2019లో పూర్తి మొత్తాన్ని చెల్లిస్తానంటూ వర్మ లేఖ కూడా పంపారని చెప్పారు. తర్వాత ఆఫీసు మూసేసి అందుబాటులో లేకుండా పోయారని తివారీ ఆరోపించారు.
గోవాలో కనిపించినప్పుడు బకాయిలు చెల్లిస్తానని చెప్పారని.. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి చిన్న సినిమాలు చేస్తున్నారని తివారీ పేర్కొన్నారు. అయితే ఈసారి ‘పోలీస్ కంపెనీ’ షూటింగ్ ప్రారంభం కాకుండా అడ్డుకోవడంతో వర్మపై ఒత్తిడి పెరిగిందని అన్నారు. కొందరు ప్రముఖులు జోక్యం చేసుకున్న తర్వాత పూర్తి మొత్తాన్ని చెల్లించారని తెలిపారు.
హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘పోలీస్ కంపెనీ’.. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో రూపొందుతోంది. దయా నాయక్ పాత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక వర్మ సిండికేట్, సర్కార్ 4 సినిమాలపై కూడా పనిచేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.