విమానాలు ఎక్కువగా తెల్లగానే ఎందుకుంటాయో తెలుసా? కారణాలు ఇవే..!
- ఎండను ఎక్కువగా ప్రతిబింబించే తెలుపు రంగు
- విమానం ఎండలో ఉన్నప్పుడు వేడిని తగ్గించడంలో ఉపయోగకరం
- తెల్లటి ఉపరితలంపై మరకలు, దెబ్బతిన్న భాగాలు సులభంగా కనిపిస్తాయి
- ఎయిర్‌లైన్ లోగోలు, డిజైన్లకు తెల్లటి విమానం మంచి బ్యాక్ గ్రౌండ్
- విమానాలకు తెలుపు రంగే ఉండాలన్న నిబంధన ఏదీ లేదు
విమానాశ్రయానికి వెళ్లినప్పుడు వరుసగా కనిపించే విమానాలను ఒక్కసారి గమనించండి. ఎయిర్‌లైన్స్ పేర్లు, లోగోలు, వెనక భాగాల్లో కొన్ని రంగులు మినహా విమానం ప్రధాన భాగం మాత్రం ఎక్కువగా తెల్లగానే ఉంటుంది. అసలు, ప్రయాణికుల విమానాలకు ఈ రంగునే ఎందుకు ఎంచుకుంటారు? దీని వెనుక అందానికి మించిన కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి.
తెలుపు రంగు సూర్యకాంతిని ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. దీంతో నల్లటి లేదా ముదురు రంగులతో పోలిస్తే విమానం బయట భాగం తక్కువగా వేడెక్కుతుంది. ముఖ్యంగా విమానం ఎండలో రన్‌వేపై నిలిపి ఉంచినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అలాగే విమానం బయటి భాగాన్ని తరచూ తనిఖీ చేస్తుంటారు. తెల్లటి ఉపరితలంపై మురికి, ద్రవాల మరకలు, పెయింట్ దెబ్బతినడం వంటి లోపాలు సులభంగా కనిపిస్తాయి. దీంతో నిర్వహణ సిబ్బందికి తనిఖీలు కొంత సులభమవుతాయి.
మరో ముఖ్యమైన కారణం ఎయిర్‌లైన్ బ్రాండింగ్. తెల్లటి విమానం ఓ ఖాళీ కాన్వాస్‌లా ఉంటుంది. దానిపై కంపెనీ పేరు, లోగో, గీతలు, ఇతర డిజైన్లను సులభంగా వేయొచ్చు. విమానం ఒక ఎయిర్‌లైన్ నుంచి మరో ఎయిర్‌లైన్‌కు మారినప్పుడు కూడా తెల్లటి రంగు ఉపయోగపడుతుంది. మొత్తం విమానానికి కొత్త రంగు వేయాల్సిన అవసరం లేకుండా కొత్త సంస్థ బ్రాండింగ్‌ను మార్చుకోవచ్చు. ఎండ వల్ల రంగు వెలిసిపోవడం కూడా ఇతర ముదురు రంగులతో పోలిస్తే అంతగా కనిపించదు.
అయితే తెల్లటి పెయింట్ వల్ల ఇంధనం ఆదా అవుతుందన్న ప్రచారం మాత్రం పూర్తిగా నిజం కాదు. పెయింట్ బరువు దాని రంగుపై కాకుండా ఉపయోగించిన కోటింగ్ విధానం, పూత పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఇక, అన్ని విమానాలు తెల్లగా ఉండాల్సిన నిబంధన ఏదీ లేదు. తమ బ్రాండ్‌కు తగ్గట్టు ఎయిర్‌లైన్స్ వివిధ రంగులను ఉపయోగిస్తుంటాయి.