మెగా డాటర్ నిర్మాతగా శ్రీకాంత్ - ప్రకాశ్ రాజ్ సిరీస్!

Jagame Sangeetham Series Update
  • తెలుగు సిరీస్ గా  రూపొందిన 'జగమే సంగీతం'
  • సంగీతం నేపథ్యంలో సాగే కథాకథనాలు 
  • ప్రధానమైన పాత్రలలో శ్రీకాంత్ - ప్రకాశ్ రాజ్
  • దర్శకుడిగా వ్యవహరించిన పల్నాటి సూర్యప్రతాప్ 
  • నిర్మాతగా సుస్మిత కొణిదెల  

మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాతగా సినిమాలు .. సిరీస్ లు నిర్మిస్తూ వెళుతున్నారు. తాజాగా ఆమె మరొక సిరీస్ ను తెలుగు పేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంగీతం నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ కథలో ప్రధానంగా కనిపించనున్నాయి. అందువలన ఈ సిరీస్ కి 'జగమే సంగీతం' అనే టైటిల్ ను సెట్ చేశారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో శ్రీకాంత్ - ప్రకాశ్ రాజ్ ప్రధానమైన పాత్రలలో కనిపించనున్నారు.

ఒకప్పుడు కళాకారులు ఆ కళను తమ వారసులు కొనసాగించాలని బలంగా కోరుకునేవారు. వారసులు కూడా దానిని గర్వంగా స్వీకరించేవారు. అది తమ బాధ్యత అన్నట్టుగా వ్యవహరించేవారు. అలాంటి ఒక కర్ణాటక సంగీత నేపథ్యం కలిగిన కుటుంబం, తరతరాలుగా వారసత్వాన్ని కాపాడుతూ వస్తున్న కుటుంబ సభ్యుల చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్ కొనసాగుతుంది. బంధాలు.. అనుబంధాలు .. ఆచారాలు .. సంప్రదాయాలను టచ్ చేస్తూ ఈ సిరీస్ నడుస్తుంది. తెలుగుతో పాటు తమిళంలోను 'అమెజాన్ ప్రైమ్' లో అందుబాటులోకి రానుంది.

'శాస్త్రి' ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఆయన వారసత్వాన్ని కొనసాగించడమే మనవడి ఆశయంగా మారుతుంది. అప్పటి కాలం .. ఇప్పటితరం మధ్యలోని అంతరాలను స్పర్శిస్తూ ఈ కథ కొనసాగుతుంది. పేరు ప్రతిష్ఠలకు నిలయమైన ఆ కుటుంబం చుట్టూ విభేదాలు .. వివాదాలు ఎలా అలుముకున్నాయి? అందుకు కారణాలు ఎలాంటివి? కారకులు ఎవరు? అనే అంశం చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ సిరీస్, సెప్టెంబర్ 4 నుంచి 240 దేశాలలో స్ట్రీమింగ్ కానుంది.  

Advertisement
Sushmita Konidela
Jagame Sangeetham
Srikanth
Prakash Raj
Amazon Prime Video
Telugu Web Series

More Telugu News