రవితేజ 'ఇరుముడి'లో 'మల్లెపూల పల్లకి' పాటపై విమర్శలు.. దర్శకుడు శివ నిర్వాణ వివరణ

Ravi Teja Irumudi movie Mallepula Pallaki song criticism Director Shiva Nirvana clarifies
  • ఇటీవల 'ఇరుముడి' నుంచి 'మల్లెపూల పల్లకి' పాట విడుదల
  • గాయకుడి వాయిస్‌పై సోషల్ మీడియాలో విమర్శలు
  • స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ
  • ఒరిజినల్ సింగర్‌కు గౌరవం ఇచ్చేందుకే ఈ నిర్ణయమని వెల్లడి
  • వయసు రీత్యా గాత్రంలో మార్పు సహజమని వ్యాఖ్య
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 'ఇరుముడి' చిత్రం నుంచి విడుదలైన 'మల్లెపూల పల్లకి' పాటపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు. గాయకుడి వాయిస్ బేస్ పాటను దెబ్బతీసిందంటూ జరుగుతున్న చర్చకు ఆయన వివరణ ఇచ్చారు. ఒరిజినల్ సింగర్‌కు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

ఈ విషయంపై మాట్లాడుతూ... ఒరిజినల్ పాట విడుదలై 15 ఏళ్లకు పైగా అయిందని, వయసు రీత్యా గాయకుడి గాత్రంలో మార్పు రావడం సహజమని శివ నిర్వాణ అన్నారు. సింగర్ వాయిస్ బేస్ సరితూగదనే విషయం తమకు ముందే తెలుసని, అయినా ఆ పాటకు ప్రాణం పోసిన ఒరిజినల్ గాయకుడు డప్పు శ్రీనుతోనే మళ్లీ పాడించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఆయనకు గౌరవం ఇవ్వడం కోసమే ఈ పని చేశామని స్పష్టతనిచ్చారు.

మాస్ మహారాజా రవితేజ, విలక్షణ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న 'ఇరుముడి' సినిమా నుంచి ఆదివారం ఈ పాట విడుదలైంది. విడుదలైన వెంటనే ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుని, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరచిన ఈ పాటకు చౌడం శ్రీనివాసరావు సాహిత్యం అందించారు.

ప్రేమకథా చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన శివ నిర్వాణ, మాస్ ఇమేజ్ ఉన్న రవితేజతో సినిమా చేస్తుండటంతో 'ఇరుముడి'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో టీ-సిరీస్ ఫిల్మ్స్‌తో పాటు ఏకేడీ స్టూడియోస్, యూవీ సంస్థలు కూడా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి.

ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
Advertisement
Ravi Teja
Shiva Nirvana
Irumudi movie
Mallepula Pallaki song
Dappu Srinu
GV Prakash Kumar

More Telugu News