భూమిపై జీవించిన అతిపెద్ద సర్పం.. గుజరాత్‌లో ‘వాసుకి’ శిలాజాలు!
- గుజరాత్‌లో 4.7 కోట్ల ఏళ్ల నాటి అతిపెద్ద సర్పం శిలాజాలు గుర్తింపు
- ఈ పాముకు 'వాసుకి ఇండికస్' అని పేరు పెట్టిన ఐఐటీ రూర్కీ పరిశోధకులు
- స్కూల్ బస్సు కంటే పొడవుగా, 15 మీటర్ల వరకు పెరిగేదని అంచనా
- ప్రపంచంలోనే అతిపెద్ద సర్పంగా రికార్డు సృష్టించే అవకాశం
దాదాపు 4.7 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన ఓ భారీ సర్పం అవశేషాలు భారత్‌లో వెలుగుచూశాయి. ఐఐటీ రూర్కీకి చెందిన పరిశోధకులు గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఈ శిలాజాలను కనుగొన్నారు. ఈ ప్రాచీన సర్పం ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా పేరొందిన ‘టైటానోబోవా’ రికార్డును సైతం బద్దలుకొట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మొసలి అనుకుంటే.. మహా సర్పం బయటపడింది
2004లో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న పనంధ్రో బొగ్గు గనిలో తవ్వకాలు జరుపుతుండగా 27 భారీ వెన్నుపూసల శిలాజాలు బయటపడ్డాయి. వాటి భారీ పరిమాణం చూసి, తొలుత అవి ఏదైనా ప్రాచీన మొసలికి చెందినవిగా పరిశోధకులు భావించారు. అయితే, ఐఐటీ రూర్కీకి చెందిన పాలియంటాలజిస్ట్ ప్రొఫెసర్ సునీల్ బాజ్‌పాయ్, ఆయన బృందంలోని పరిశోధకుడు దేబాజిత్ దత్తా ఈ శిలాజాలపై సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఆధునిక సరీసృపాల ఎముకలతో, ఇతర శిలాజాలతో పోల్చి చూసిన తర్వాత, అవి ఒక ప్రత్యేకమైన, అత్యంత భారీ ప్రాచీన సర్పానికి చెందినవని నిర్ధారించారు.
స్కూల్ బస్సు కన్నా పొడవు.. అనకొండలా వేట
పరిశోధకుల అంచనా ప్రకారం, ఈ సర్పం పొడవు 10.9 మీటర్ల నుంచి 15.2 మీటర్ల (సుమారు 36 నుంచి 50 అడుగులు) వరకు ఉండేది. అంటే, ఇది ఒక సాధారణ స్కూల్ బస్సు కన్నా పొడవుగా ఉండేదని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. దీని శరీరం విశాలంగా, స్థూపాకారంలో అత్యంత బలమైన కండరాలతో ఉండేదని తెలిపారు. ఇది వేగంగా కదిలే వేటగాడు కాదని, నేటి అనకొండలు, కొండచిలువల మాదిరిగా నీటిలో లేదా చిత్తడి నేలల్లో పొంచి ఉండి, అటుగా వచ్చిన జీవులను చుట్టేసి ఊపిరాడకుండా చేసి ఆహారంగా తీసుకునేదని (ambush predator) భావిస్తున్నారు.
‘వాసుకి ఇండికస్’.. పేరు వెనుక ఆసక్తికర కథ
హిందూ పురాణాలలో పరమశివుడి మెడలో అలంకారంగా ఉండే నాగేంద్రుని పేరు ‘వాసుకి’. ఆ పేరును స్ఫూర్తిగా తీసుకుని, ఈ శిలాజాలు భారతదేశంలో లభ్యం కావడంతో ‘ఇండికస్’ అనే పదాన్ని జోడించి, దీనికి ‘వాసుకి ఇండకస్’ అని శాస్త్రీయ నామకరణం చేశారు. మిడిల్ ఈసిన్ కాలంలో, అంటే 4.7 కోట్ల ఏళ్ల క్రితం ఈ ప్రాంతం అత్యంత వేడిగా, చిత్తడి నేలలు, దట్టమైన అడవులతో నిండి ఉండేదని పరిశోధకులు వివరించారు. ఈ కీలక పరిశోధన వివరాలు ప్రఖ్యాత సైన్స్ జర్నల్ ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ప్రచురితమయ్యాయి.